అమ్మపాలు అమృతం

అనూష కొమ్మిని
ఫ్యాకల్టీ ,పీడియాట్రిక్ నర్సింగ్

“అమ్మపాలు ముమ్మాటికీ మేలే, తల్లి పాలు మురిపాలు
అమ్మపాలకి దోషం లేదు ,అమ్మపాలు స్వచ్ఛమైనవి
ఒక్క మాటలో చెప్పాలంటే అమ్మపాలు అమృతంతో సమానం “
ప్రపంచంలో కలితి లేనిది అంటూ ఉంటే అది తల్లిపాలు మాత్రమే!
తల్లి బిడ్డను ధగ్గరకు చేర్చే గొప్ప వారధి తల్లిపాలు. తల్లి పాలపైన అవగాహన పెంచవలసిన నేపధ్యం లో ప్రతి సంవత్సరం అగ‌ష్టు మొదటివారంలో 1వ తేదీ నుండి 7వ తేదీ వరకు తల్లిపాల వారోత్స‌వంగా ప్ర‌పంచ వ్యాప్తంగా నిర్వ‌హిస్తారు.
తల్లిపాలు తాగడం బిడ్డకు జన్మతః సంక్రమించిన హక్కు, పుట్టిన అరగంట లోపు అందించే ముర్రిపాలు (కోలస్ట్రల్‌) బిడ్డకు ఎంతో మేలు .దీని వలన వారిలో వ్యాధినిరోధక శక్తి పెరగడంతో పాటు సమతుల్య ఆహారం అందుతుంది. ఎల్లప్పుడూ పరిశుభ్రంగా, శిశువుకు కావలసిన ఉష్ణోగ్రతతో ఉంటాయి.
తల్లిపాల వలన బిడ్డకు కలిగే లాభాలు :

  • తల్లి పాలల్లో ఎక్కువ శాతం నీరు ఉంటుంది, వ్యాధినిరోధక శక్తి పెంచుతుంది. బిడ్డకు కావలిసిన ఖనిజాలు, మాంసపుకృతులు, ప్రోటీన్లు, విటమిన్-ఎ,యాంటిబొడిస్ సమృద్ధిగా ఉంటాయి.
  • జీర్ణ వ్యవస్థను పెంపొందించి మంచి బాక్టీరియాను వృద్ధి చేసి హానికరమైన బాక్టీరియాను తొలగిస్తుంది. తల్లిపాలు తాగే బిడ్డలో వాంతులు ,విరోచనలు వంటివి ఉండవు, మలబద్ధకం ఉండదు.
  • మానసిక ఎదుగుదలకు ఎంతగానో ఉపయోగపడుతుంది.
  • తల్లిపాల వలన పోషకాహార లోపాలు తగ్గి శిశువు మరణాల శాతాన్ని తగించవచ్చు.
  • శిశువు పెరుగుదల మానాసికంగా అభివృద్ధి ఆరోగ్యాన్ని సాధించాలoటే మొదటి 6 నెలలు కేవ‌లం తల్లిపాలు మాత్రమే తాగించాలి.
    తల్లికి కలిగే లాభాలు :
  • తల్లిపాలు ఇవ్వడం వలన తల్లికి ప్రసవం తరువాత బరువు తగ్గుటకు దోహదపడుతుంది.
  • మానసిక ఒత్తిడిని తగ్గించి బాలింత దశలో రక్తస్రావాన్ని తగ్గిస్తుంది.
    -తల్లికి రొమ్ము కాన్సర్, అండాశయ కాన్సర్ లాంటివి రాకుండా స్త్రీని కాపాడుతుంది.
  • బిడ్డకు పాలు ఇవ్వడం వలన మొదటి 6 నెలలు అండం విడుదల కానందున గర్భం దాల్చే అవకాశం లేదు. తల్లికి సహజ కుటుంబ నియంత్రణ పద్దతిగా ఉపయోగపడుతుంది. ఈ పద్దతిని లక్టషనల్ ఏమనోరియా అని అంటారు.
    పాలు ఎప్పుడు ఎలా ఇవ్వాలి :
    ప్రసవం ఆయన మొదటి అరగంటలో బిడ్డను శుభ్రపరచి వెంటనర్ తల్లి రొమ్ముల ధగరకు ఉంచినట్లు అయితే బిడ్డ శరీర ఉష్ణోగ్రత పెరుగుతుంది. తల్లిపాలు రావడానికి ప్రేరణ ఏర్పడుతుంది. తల్లి బిడ్డల మధ్య అనుబంధం పెరుగుతుంది. ఈ సమయంలో బిడ్డకు పాలు తాగడానికి చాలా ఆతృతను పెంచుతుంది.
    ప్రతిరోజు రెండు గంటలకు ఒకసారి లేదా బిడ్డ కోరుకున్న ప్రతిసారి పగలైన, రాత్రైనా తల్లిపాలు పట్టాలి. బిడ్డ ఎంతసేపు పాలు త్రాగుతుందో అంత సేపు తాగిస్తుండలి. పాలు ఇచ్చిన ప్రతిసారి బిడ్డను భుజంపైన నెమ్మదిగ తట్టడం తప్పనిసరి . దీనివలన పాలతో పాటు తీసుకున్న గాలిని బయటకు తెంపడం వలన వాంతులు రాకుండా కడుపు కుదుట పడుతుంది.
    తల్లికి కరోనా వస్తే.. బిడ్డకు పాలివ్వడం ఆపేయ్యాలా.?
    కరోనా సోకిన బాలింత తన బిడ్డకు కావాలనుకుంటే తల్లిపాలు పట్టొచ్చు. కానీ కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా ఆమె తన నుంచి బిడ్డకు వైరస్ సోకకుండా కాపాడుకోవచ్చు.
    బిడ్డకు పాలివ్వచ్చా?
    ఇవ్వొచ్చు, ఇవ్వాలి. మీరు బాలింత అయితే మీ బిడ్డకు తల్లిపాలు మాత్రమే పట్టాల్సిన ఆవశ్యకతనూ, మీ బిడ్డను మీరు దగ్గరగా హత్తుకోవల్సిన అవసరాన్ని గుర్తించండి. ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకారం కొవిడ్-19 సోకిన బాలింత తన బిడ్డను హత్తుకోడానికీ, తన బిడ్డతో పాటూ ఒకే గదిలో ఉండడానికీ, తన బిడ్డకు తల్లిపాలు పట్టడానికీ కావాల్సిన సహాయం అందించాలి.
  1. ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకారం కొవిడ్-19 సోకిన బాలింత తన బిడ్డను హత్తుకోడానికి, తన బిడ్డతో పాటూ ఒకే గదిలో ఉండడానికి, తన బిడ్డకు తల్లిపాలు పట్టడానికి కావాల్సిన సహాయం అందించాలి.
  2. తన తల్లి ద్వారా అప్పటికే కరోనా వైరస్ లక్షణాలకు బహిర్గతమైన శిశువుకు తల్లిపాలు చాలా మేలు చేస్తాయి.
  3. ఎందుకంటే తల్లిపాలు బిడ్డ రోగనిరోధకవ్యవస్థను బలోపేతం చేసి ఎన్నో రకాల వ్యాధుల నుంచి బిడ్డని రక్షిస్తాయి. ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకారం తన తల్లి ద్వారా అప్పటికే కరోనా వైరస్ లక్షణాలకు బహిర్గతమైన శిశువుకు తల్లిపాలు చాలా మేలు చేస్తాయి. ఎందుకంటే తల్లిపాలు బిడ్డ రోగనిరోధకవ్యవస్థను బలోపేతం చేసి ఎన్నో రకాల వ్యాధులనించి బిడ్డని రక్షిస్తాయి.
    ఆరోగ్యకరమైన భవిష్యత్తును తల్లి తన బిడ్డకు అందించడానికి ప్రతిఒక్కరు తల్లిని గౌరవిస్తూ సహకరించాలి. మనవందు భాధ్యతను పాటిస్తూ, ప్రోత్సహిస్తు సమాజంలో పాలు ఇచ్చే ప్రతితల్లికి మన మద్దతు తెలుపుదాం.