మరో 1000 కోట్లు ఖర్చు చేస్తాం : సీఎం
కోవిడ్–19 వైరస్ సోకిన వారికి సత్వర, మెరుగైన వైద్య సేవలు అందాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి అధికార యంత్రాంగాన్ని ఆదేశించారు. అవసరాలకు అనుగుణంగా కోవిడ్ కోసం ప్రత్యేకంగా చికిత్స అందించే ఆసుపత్రుల పెంపు, అందులో మౌలిక సదుపాయాల కల్పనకు వచ్చే 6 నెలల్లో దాదాపు రూ.1000 కోట్లు ఖర్చు చేస్తున్నామని వెల్లడించారు. కోవిడ్–19 నివారణ చర్యలపై ఆయన తన క్యాంపు కార్యాలయంలో ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. కరోనాని అడ్డుకోవడానికి తమ అధికారులు, వైద్య సిబ్బంది విసృత సేవల చేస్తున్నారని సీఎం పేర్కొన్నారు.