29 వ‌ర‌కు సంపూర్ణ లౌక్‌డౌన్‌

రాష్ట్రంలో కరోనా వ్యాప్తిని అంచన వేసేందు విమనాల రాకపోకలను నిలిపివేస్తున్నట్లు పశ్చిమ బెంగాల్‌ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ప్రభుత్వం శుక్రవారం ప్రకటించింది. రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో మహమ్మారి తీవ్రత రోజురోజుకు పెరుగుతుండటంలో‌ వారంలో రెండు రోజుల పాటు అగష్టు 31 వరకు సంపూర్ణ లాక్‌డౌన్‌కు దీదీ ప్రభుత్వం పిలుపునిచ్చింది. ఈ నేపథ్యంలో శనివారం, జులై 29(బుధవారం) లాక్‌డౌన్ విధించాలని సోమవారం జరిగిన సమీక్ష సమావేశంలో నిర్ణయించినట్లు ప్రభుత్వ అధికారులు తెలిపారు. ఈ లాక్‌డౌన్ రోజుల్లో అత్యవసర సేవలు మినహా అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ కార్యాలయాలు, వాణిజ్య సంస్థలు, ప్రభుత్వ, ప్రైవేట్ రవాణా కార్యకలాపాలు నిరోధించబడతాయని అధికారులు వెల్లడించారు. అంతేగాక రాత్రి 10 నుంచి ఉదయం 5 గంటల మధ్య వ్యక్తులు రోడ్లపైకి రావడాన్ని కూడా నిషేధించినట్లు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. అత్యవసర సేవలు, సంరక్షణ కార్యకలాపాలతో పాటు ఆరోగ్య సిబ్బంది రవాణా, ఫార్మసీలకు లాక్‌డౌన్‌ రోజుల్లో అనుమతి ఉన్నట్లు స్పష్టం చేసింది. వాటితోపాటు ఇంట్రాస్టేట్‌, అంతరాష్ట్ర వస్తువుల రవాణ, ఫుడ్‌ డెలివరీలు ఈ లా​క్‌డౌన్‌ రోజుల్లో యథావిధిగా కొనసాగుతాయని ప్రభుత్వం ఉత్తర్వుల్లో పేర్కొంది. పశ్చిమ బెంగాల్‌లో గడిచిన 24 గంటల్లో 2 వేలకు పైగా కొత్త కరోనా కేసులు నమోదు కావడంతో మొత్తం కేసుల సంఖ్య 51, 757కు చేరుకోగా 1,255 మంది మరణించారు.