ఏడాదికి ఓ మొగుడు, జల్సా జీవితం
ఏడాదికి ఒక మొగుడు, జల్సా జీవితం, ఒళ్ళు నొప్పి పెట్టకుండా సంపాదన కి అలవాటు పడ్డ వాన్నేలాడి
అమాయకపు అమ్మాయిలపై కన్నేసేది. అభం శుభం తెలియని ఆ అమ్మాయిలకు మాయమాటలు చెప్పి.. వ్యభిచార కూపంలోకి దింపేది. అలా ఎంతో మంది యువతుల జీవితాలను నాశనం చేస్తూ.. ఢిల్లీలోనే అతిపెద్ద సెక్స్ రాకెట్ నడిపిన సోనూ పంజాబన్ అలియాస్ గీతా అరోరాకు ఢిల్లీలోని ఓ కోర్టు 24 ఏండ్ల జైలు శిక్షను విధించింది. సోనూకు అండదండగా ఉండి. కార్యకలాపాలకు తోడుగా ఉన్న.. ఆమె అనుచరుడు సందీప్ బెద్వాల్‌కు 20 ఏండ్ల జైలు శిక్షను ఖరారు చేసింది. సోనూ, సందీప్ కు రూ.65 వేల చొప్పున జరిమానా కూడా విధించింది. డ్రగ్స్‌తో, చిత్రహింసలతో బాలికలను, మహిళల్ని వ్యభిచారంలోకి బలవంతంగా దింపిన సోనూపై జాలి చూపాల్సిన అవసరం కూడా లేదని తీర్పు సందర్భంగా కోర్టు వ్యాఖ్యానించింది.
సందీప్ 2009లో ఓ 12 ఏళ్ల బాలికను ప్రేమిస్తున్నట్లు నమ్మించాడు. పెళ్లి చేసుకుంటానని మాయమాటలు చెప్పి సీమ అనే మహిళ వద్దకు తీసుకెళ్లాడు. ఆ బాలికను లొంగదీసుకున్నాడు. అనేకసార్లు ఆమెపై అత్యాచారం చేశాడు. తన కోరికలు తీర్చుకున్న తర్వాత.. సీమకు ఆ అమ్మాయిని అమ్మేశాడు. ఇక సీమ కూడా ఆ బాలికతో వ్యభిచారం చేయించింది. కొన్నాళ్ల తర్వాత ఆ అమ్మాయిని సోనూ పంజాబన్‌కు అమ్మేసింది.
రొమ్ములపై కారం చల్లి..
సోనూ వద్దకు చేరిన బాధిత బాలికకు వేధింపులు అధికమయ్యాయి. విటుల వద్దకు పంపే ముందు ఆమెను క్రూరంగా హింసించేది. వారు చెప్పినట్లు చేయాలని భయపెట్టించేది. అంతే కాదు.. బాలిక రొమ్ములపై కారం చల్లి హింసించేది. నోట్లో కూడా కారం కొట్టేది. విటులు చెప్పినట్లు చేయకపోతే.. ఈ క్రూరమైన చర్యలు తప్పవని హెచ్చరించేది. వీటన్నింటికి బాలిక భయపడి.. ఆమె చెప్పినట్లు చేసేది. బాలికను తీవ్రంగా హింసించిన సోనూ.. ఆమెను ముగ్గురు వ్యక్తులకు అమ్మేసింది. చివరకు సత్పాల్ అనే వ్యక్తి ఆ అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు. అతడి చిత్రహింసలు భరించలేక 2014లో తప్పించుకుని సమీపంలోని పోలీస్ స్టేషన్‌కు చేరింది బాధిత బాలిక.
సోనూ, ఆమె గ్యాంగ్‌పై 2014లో కేసు నమోదు
బాలిక తనకు జరిగిన ఘోర అవమానాలు, సోనూ పెట్టిన చిత్రహింసల గురించి పోలీసులకు చెప్పడంతో.. వారు మానవీయ కోణంలో స్పందించి కేసు నమోదు చేశారు. 2014లో సోనూపై కేసు నమోదు కాగా, దాదాపు మూడేళ్ల తర్వాత 2017లో ఆమెను ఢిల్లీ పోలీసులు అరెస్టు చేశారు. సుదీర్ఘ విచారణల తర్వాత ఢిల్లీలోని ద్వారకా కోర్టు సంచలన తీర్పు ఇచ్చింది. కేసు నమోదైన తర్వాత దాదాపు ఆరేళ్లకు కఠిన శిక్ష విధిస్తూ న్యాయమూర్తి ప్రీతం సింగ్ తీర్పు వెల్లడించారు. ఈ సందర్భంగా బాధిత బాలికకు రూ.7 లక్షల పరిహారం అందించాలని ఆదేశించారు.
ఏడాదికో మొగుడు..
సోనూ పంజాబన్ పూర్తిగా బ్యాడ్ బాయ్స్ తోనే ఉండాలని కలలు కనేది. ఈ క్రమంలో తొలిసారిగా 2003లో యూపీకి చెందిన విజయ్ సింగ్ అనే గ్యాంగ్‌స్టర్‌ని ప్రేమించి పెళ్లి చేసుకుంది. వీరిద్దరికి వివాహమైన కొద్ది రోజులకే యూపీ స్పెషల్ టాస్క్ ఫోర్స్ పోలీసులు జరిపిన ఓ ఎన్‌కౌంటర్‌లో విజయ్ హతమయ్యాడు. ఆ తర్వాత దీపక్ అనే మరో గ్యాంగ్‌స్టర్‌తో ప్రేమలో మునిగితేలింది. అతన్ని పెళ్లి చేసుకుందామనే లోపే అతను ఎన్‌కౌంటర్‌లో చనిపోయాడు. దీంతో దీపక్ సోదరుడు హేమంత్ ను సోనూ పెళ్లి చేసుకుంది. ఇతను కూడా గ్యాంగ్‌స్టరే. 2006లో ఢిల్లీ, గుర్గావ్ బోర్డర్‌లో స్పెషల్ సెల్ పోలీసులు జరిపిన ఎన్‌కౌంటర్‌లో హేమంత్ ప్రాణాలు కోల్పోయాడు.
ఇలా ఏడాదికో మొగుడిని పెళ్లి చేసుకుని, అమ్మాయిల జీవితాలతో ఆటలాడిన సోనూ.. 2007లో తొలిసారి హ్యూమన్ ట్రాఫికింగ్ కేసులో అరెస్టు అయింది. 2008లో మరోసారి అరెస్టు అయి బెయిల్ పై బయటకొచ్చింది. ఆ తర్వాత సెక్స్ రాకెట్ కేసులో 2011లో జైలుకెళ్లింది సోనూ. బెయిల్ పై బయటకొచ్చిన తర్వాత ఆమె ప్రవర్తనలో ఎలాంటి మార్పు రాలేదు. మళ్లీ అమ్మాయిలను ట్రాప్ చేసి వ్యభిచార కూపంలోకి దింపేది. మొత్తానికి 12 ఏళ్ల బాలికను క్రూరంగా హింసించిన కేసులో ఆ కేడీ లేడీకి కఠిన శిక్ష పడింది.