గోల్డెన్ పీకాక్ నేషనల్ ట్రెయినింగ్ అవార్డ్ 2020 ను గెలుచుకున్న యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా

యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మరోసారి ప్రతిష్టాత్మక గోల్డెన్ పీకాక్ నేషనల్ ట్రైనింగ్ అవార్డు – 2020 ను గెలుచుకుంది. ఈ అవార్డును న్యూ ఢిల్లీలోని ఇన్స్టిట్యూట్ ఆఫ్ డైరెక్టర్స్ (ఐఓడి) ఈ రోజు జరిగిన వర్చువల్ అవార్డు కార్యక్రమంలో ప్రదానం చేసింది. జాతీయ శిక్షణ అవార్డు విభాగంలో యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఈ అవార్డును గెలుచుకోవడం ఇది 9వ సారి.

యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా జనరల్ మేనేజర్ (హెచ్ఆర్ – ఎల్ అండ్ డి) శ్రీ వినాయక్ వి. టెంబర్న్ ఈ అవార్డును అందుకున్నారు. అవార్డును అంగీకరిస్తూ, శ్రీ టెంబుర్న్, బ్యాంక్ యొక్క శిక్షణా వ్యవస్థ విజయవంతమైన బ్యాంకర్లను సృష్టించడంలో మరియు తాజా బోధనాపద్ధతిని బోధించడం ద్వారా, బ్యాంక్ దృష్టికోణానికి అనుగుణంగా ఉద్యోగులను సంస్థ యొక్క సంస్కృతిలోకి సాంఘికీకరించడం మరియు మా ఫౌండేషన్ యొక్క దేశ నిర్మాణంలో భాగస్వాములను చేయడంలో నిమగ్నమైందని చెప్పారు.