హైదరాబాద్‌లో హై రిస్క్ ప్రాంతాలు ఇవే
హైదరాబాద్ లో కరోనా కేసులు రోజు రోజుకూ భారీ సంఖ్యలో నమోదవుతున్నాయి. ప్రతిరోజు పలువురు నగరవాసులు ఈ వైరస్ బారిన పడుతున్నారు. ఈ క్రమంలో నగరంలో కేసులు ఎక్కువగా నమోదవుతున్న హైరిస్క్ జోన్లను అధికారులు గుర్తించారు. 500 కేసుల కంటే ఎక్కువ కేసులు నమోదైన ప్రాంతాలను హైరిస్క్ జోన్లుగా పరిగణిస్తున్నారు. ఇలాంటి జోన్లు నగరంలో ఇప్పటి వరకు 8 ఉన్నట్టు అధికారులు గుర్తించారు. మెహదీపట్నం, యూసుఫ్ గూడ, అంబర్ పేట, చాంద్రాయణగుట్ట, చార్మినార్, కుత్బుల్లాపూర్, కార్వాన్, రాజేంద్రనగర్ సర్కిళ్లను హైరిస్క్ జోన్లుగా అధికారులు గుర్తించారు. ఈ జోన్లను హైరిస్క్ జోన్లుగా చేయాలని అధికారులు భావిస్తున్నారు. ఒక్కొక్క జోన్ లో 10 నుంచి 20 వరకు మొత్తంగా 100కు పైగా కంటైన్మెంట్ జోన్లను ఏర్పాటు చేసేందుకు జీహెచ్ఎంసీ అధికారులు చర్యలు చేపట్టినట్లు సమాచారం. దీంతో హైరిస్క్ జోన్ల నుంచి ఇతర ప్రాంతాలకు వైరస్ సోకకుండా అరికట్టవచ్చిన అధికారులు భావిస్తున్నారు.