1700 రోజుల మైలురాయికి చేరుకోబోతున్న విశ్వమానవవేదిక నిత్యాన్నదానం
-2015 నవంబర్ 17వ తేదిన ప్రారంభమైన విశ్వమానవవేదిక నిత్యాన్నదానం
- విశ్వమానవవేదిక ఉచిత వృద్ధాశ్రమంతో పాటు ఎంతోమంది ఆదరణలేని వృద్ధుల ఆకలి తీరుస్తున్న నిత్యాన్నదానం
కాలే కడుపులకు కాస్త అన్నపెడదామన్న నినాదంతో 2015 నవంబర్ 17వ తేదిన పాలకొల్లు ప్రాంతంలో ప్రారంభి్ంచిన విశ్వమానవవేదిక నిత్యాన్నదానానికి 2020వ జులై 12వ తేది నాటికి 1700 రోజులు పూర్తిచేసుకోబోతోంది. ఎంతోమంది ఆదరణలేని వృద్ధులు, రోగులకు ఏ ఒక్కరోజూ ఆగకుండా అందిస్తున్న భోజనం వెనుక విశ్వమానవవేదిక సభ్యులు, ఆత్మీయులు, మానవతావాదుల సహకారం మరువలేనిది. ప్రతీరోజూ అన్నదాన కార్యక్రమాన్ని ఒక యజ్ఞంలా నిర్వహిస్తున్న విశ్వమానవవేదిక సభ్యులకు పేరుపేరునా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. విశ్వమానవవేదిక నిత్యాన్నదానం టీమ్ లీడర్ విశ్వమానవవేదిక శ్యామ్ ఆధ్వర్యంలో టీమ్ సభ్యులు సైనికుల్లా సేవలు అందిస్తున్నారు. ఒక పక్క కరోనా పడగనీడ.. మరో వైపు జోరు వర్షాలతో ప్రతికూల వాతావరణం.. లాక్‌డౌన్ సమయంలో ప్రతీరోజూ ప్రాణాలకు తెగించి మరీ సేవలు అందిస్తున్న టీమ్ సభ్యులను చూసి నేను గర్వపడుతున్నాను. విశ్వమానవవేదిక శ్యామ్ ఆధ్వర్యంలో నిత్యాన్నదానంలో ప్రతీరోజూ పాల్గొంటున్న మల్లుల బాలాజీ, గునుఫూడి సంగీతరావు, తేజ మెల్టన్, బళ్లా మేరి, నవరత్నం ఫ్రిస్కెల్, నిల్లా శ్రీలక్ష్మీలకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు విశ్వమానవ వేదిక అధ్యక్షుడు మల్లూల సురేష్ - మల్లుల సురేష్, విశ్వమానవవేదిక అధ్యక్షుడు
9652256999
విశ్వమానవవేదిక ఉచిత వృద్ధాశ్రమం – నిత్యాన్నదానం
బీఆర్ ఎంవీ హైస్కూల్ వెనుక, సరస్వతీ శిశుమందిర్ పక్కన
పాలకొల్లు రైల్వే స్టేషన్ దగ్గర, పాలకొల్లు, పశ్చిమగోదావరి జిల్లా
ఫోన్ నంబర్ – 08814226399