కరోనా రోగులకు కిమ్స్ హోం ట్రీట్‌మెంట్
కోవిడ్-19 సోకిన రోగులకు కిమ్స్ హాస్పిటల్ ఆన్‌లైన్ ద్వారా హోం ట్రీట్‌మెంట్ అందిస్తోంది. ఒకరి నుండి ఒకరికి వ్యాధి సోకుతుడండంతో ప్రజలను కాపాడడానికి కిమ్స్ యజమాన్యం కోవిడ్-19 రిమోట్ హోమ్ కేర్ ప్యాకేజీని ముందుకు తీసుకొచ్చింది. కరోనా లక్షణాలు ఉన్నా… లేదా తక్కువ వ్యాధి లక్షణాలు ఉన్న రోగులు ఈ కిట్ ద్వారా ఇంటిలోనే ఉండి ట్రీట్‌మెంట్ చేయించుకోవచ్చు. దీని వల్ల ఇతరులకు వ్యాధి ప్రబలే అవకాశాన్ని తగ్గించవచ్చు. ఈ ప్యాకేజీలో భాగంగా రోగులను డాక్టర్ రోజు విడిచి రోజు ఆన్‌లైన్ ద్వారా సంప్రందించి అతని ఆరోగ్య పరిస్థితులపై అవగాహాన చేసి తగిన విధంగా మందులు రాసి ఇవ్వడం ఎలాంటి జాగ్రత్తలు పాటించాలో వివరిస్తారు. ప్రతిరోజు నర్స్ ఆన్‌లైన్ ద్వారా రోగి ఆరోగ్య పరిస్థితిపై వివరాలు సేకరిస్తుంది. అలాగే డైటిషన్ ఎలాంటి ఆహారం తీసుకోవాలో ఆన్‌లైన్ ద్వారా వివరిస్తారు. మరియు ఫిషియోథెరపిస్ట్ ఎలాంటి వ్యాయామాలు చేసి వ్యాధి నుండి త్వరగా కోలుకోవాలో అనే అంశాలను వివరిస్తారు. ఈ కిట్‌ని కిమ్స్ హాస్పిటల్ 12,999 రూపాయాలకు అందిస్తోంది. ఈ కిట్‌లో 1పల్స్ ఆక్సిమీటర్, 1 స్పిరో మీటర్, 1 డిజిటల్ థర్మామీటర్, 2 పేప్ గ్లౌజ్‌ల ప్యాక్, 500 మి.లీటర్ల 2 శానిటైజర్ బాటిళ్లు, నేలను తుడిచే క్రిమిసాంహారక ఔషదం, 3 లేయర్లు గల 60 మాస్క్‌లు మరియు చెత్త (వ్యర్థాలు)ను తొలగించే 10 ప్లాస్టిక్ సంచులను అందిస్తోంది. కోవిడ్-19 సోకితే మానసికంగా కుంగిపోకుండా ఇంట్లోనే ఉండి చికిత్స చేసుకోవాలని కోరుకుటోంది కిమ్స్ హాస్పిటల్. అత్యవసర పరిస్థితులు తలెత్తితే దగ్గరలో ఉన్న హాస్పిట్‌లక్ వెళ్లాలని సూచిస్తోంది. ఈ కిట్ కావాల్సిన వారు 9000155482 నెంబర్‌లో సంప్రదించండి.