బొడుప్పల్ లోని ప్రైవేట్ పాఠశాలల తీరు మారలేదు

తెలంగాణ మొత్తం ఒక్కతిరు అయితే బొడుప్పల్ లోని ప్రైవేట్ పాఠశాలల తీరు ఒక తీరు సాగుతోంద‌ని స్థానికుల నుంచి విమ‌ర్శ‌లు త‌లెత్తున్నాయి. ఒక దిక్కు కరోనా తో జనాలు ఇబ్బంది పడుతూఉంటే బొడుప్పల్ లో మాత్రం ప్రైవేట్ పాఠశాలలు ఆన్‌లైన్‌ క్లాస్ ల పేరుతో ఫిజులు వసూలు చేస్తున్నాయ‌ని యువ నాయ‌కుడు తిరుప‌తి యాద‌వ్ ఆరోపించారు. ఫీజులు కట్టిన వారికే ఆన్‌లైన్ లింకులు, పాస్వర్డ్ లు ఇస్తున్నారు అన్నారు. ఇప్పటికే బొడుప్పల్ లోని సగం పైగా పాఠశాలలు బుక్స్ అమ్ముతున్నారని పేర్కొన్నారు. ప్రభుత్వ నిబంధనలు తుంగల తొక్కుతున్న పాఠశాలలు ఇష్టానుసారంగా ఆన్‌లైన్ పాఠాలు చెబుతున్నాయ‌ని అన్నారు. అసలు బొడుప్పల్ లో సగం పాఠశాలకు పర్మిషన్ లు కూడా సరిగ్గా లేవని ఆరోపించారు. దీంతో ఆన్‌లైన్ విద్య అంటేనే విద్యార్థుల త‌ల్లిదండ్రులు అయోమయంలో ఉన్నార‌ని తెలిపారు. ఇప్పటికైనా అధికారులు తక్షణమే చర్యలు తీసుకోవాలని తిర‌ప‌తి యాద‌వ్ డిమాండ్ చేశారు.