కొత్త మండలంగా అవతరించిన మాసాయిపేట
ఎన్నో రోజుల కళ నెలవేరిన రోజు నేడు. ఎండ, వాన, చలి ఇవి ఏవి తేడా లేకుండా ప్రత్యేక మండల సాధన కోసం చేసిన కృషి ఫలించింది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత జిల్లాల విభజనతో పాటు పలు మండాలలను కూడా విభజించి, కొత్త మండలాలుగా కొన్నింటిని చేర్చింది. నర్సాపూర్ నియోజకవర్గంలోని వెల్ధుర్తి మండలంలోని మాసాయిపేట గ్రామ ప్రజలు తమ గ్రామాన్ని ప్రత్యేక మండంలంగా చేయాలని పోరాటం చేశారు. దీనికి సాధారణ ఎన్నికల్లో ముఖ్యమంత్రి హామీ ఇచ్చినప్పటికీ మండల ఏర్పాటు కాలేదు. దీంతో ప్రజలు జాతీయ రహాదారిపై వందల రోజులు దీక్షలు చేశారు. కాగా ఇటీవల 6వ విడత హరితహారం కార్యక్రమంలో నర్సాపూర్‌లో నిర్వహించారు. ఈ సమావేశంలో స్థానిక ఎమ్మెల్యే మదన్‌రెడ్డి సీఎం కేసీఆర్‌ని కోరారు. దీంతో వెంటనే ఆదేశాలిస్తూ తక్షణే మండల ఏర్పాటుకు సంబంధించిన పనులు పూర్తి చేయాలని తన ప్రత్యేక కార్యదర్శి నరసింహ్మరావు తెలిపారు. దీంతో జూలై 1వ తేదీన మాసాయిపేట మండలం ఏర్పాటు చేస్తున్నట్లు ప్రభుత్వం ఉత్తర్వుల జారీ చేసింది. దీంతో ఆ గ్రామ ప్రజలు హర్షం వ్యక్తం చేశారు.
నూతన మండలంలోని గ్రామాల వివరాలు
చేగుంట మండలంలోని
చెట్టతిమ్మాయిపల్లి, పోతంపల్లి, పోతంశెట్టిపల్లి, వెల్దుర్తి మండలంలోని మాసాయిపేట, అచ్చంపేట, హాకీంపేట, రామంతపూర్, కొప్పులపల్లి, లింగరెడ్డిపల్లి పంచాయితీలను కలిపి నూతన మండలంగా మాసాయిపేట అవతరించింది. ఈ మండలం రెవెన్యూ డివిజన్ పరిధి తూప్రాన్‌లో వచ్చింది. కాగా గతంలో చిన్నశంకరంపేట మండలంలోరి ధరపల్లి గ్రామాన్ని కూడా మాసాయిపేట మండలంలో విలీనం చేయాలనే ఓ ప్రతిపాదన ఉండేది. కానీ ఆ గ్రామాన్ని నూతన మండంలో కలపకపోడంతో ధరిపల్లి గ్రామాస్తులు విచారం వ్యక్తం చేస్తున్నారు.