మెదక్ లో దుమ్ము లేపుతున్న పద్మక్క: రాజశేఖర్ రెడ్డి ఘాటు విమర్శ
పోరాడి సాధించుకున్న స్వరాష్ట్రంలోనూ మెదక్ పరిస్థితి ఏ మాత్రం మారడం లేదు. అధికారంలో ఉన్న స్థానిక ఎమ్మెల్యే చిత్తశుద్ధి లేకపోవడంతో మెదక్ లోని రోడ్ల పరిస్థితి రోజు రోజుకి అధ్వానంగా మారిపోతుంది తెలంగాణ జనసమితి పార్టీ యువజన విభాగం అధ్యక్షుడు రాజశేఖర్‌రెడ్డి విమర్శించారు. ప్రత్యేక రాష్ట్రం సాధించుకొని ఆరు సంవత్సరాలు గడిచిన ఇప్పటికీ ఎక్కడ వేసిన గొంగడి అక్కడే అన్న విధంగా ఉందని తెలిపారు. మెదక్ అభివృద్ధి ఒకవేళ ఇదే పరిస్థితి ఆరు సంవత్సరాల కింద ఉంటే అది ఆంధ్ర వాడు శాపం మరి ఇప్పుడు ఎవర్ని నిందిస్తారు మెదక్ ఎమ్మెల్యే పద్మాదేవేందర్రెడ్డి చెప్పాలని డిమాండ్ చేశారు. అభివృద్ధిలో భాగంగా మెదక్ పట్టణం గుండా వెళ్తున్న రోడ్లను వెడల్పు చేయడానికి ఇరువైపుల ఉన్న భవనాలను కూల్చివేశారని పేర్కొన్నారు. అలాగే రోడ్ల మధ్యలో డివైడర్ కట్టారని కానీ రోడ్డు వెడల్పు చేసి కొత్త రోడ్లు వేయడం మాత్రం మరిచిపోయారని ఎద్దేవ చేశారు. కాంట్రాక్టర్ల దగ్గర కమిషన్లు తీసుకోవడం వల్లే మెదక్ ఈ పరిస్థితి ఏర్పడిందని ఆయన మండిపడ్డారు. తెలంగాణలోని వివిధ జిల్లాలలో పనులు చేసిన కాంట్రాక్టర్లు ఆర్థిక స్థిరత్వం పొందితే మెదక్ లో పనులు చేసిన కాంట్రాక్టర్లు మాత్రం బిచ్చగాళ్ళ అయిపోయారని ఆయన ఆరోపించారు. ప్రజల అవసరాలను దృష్టిలో ఉంచుకొని మెదక్ ఎమ్మెల్యే పద్మాదేవేందర్రెడ్డి ఇప్పటికైనా కళ్ళు తెరవాలని ఆయన హెచ్చరించారు. మెదక్ లో అన్ని పనులు నత్తనడకన సాగుతున్నాయని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు ఇకనైనా ఎమ్మెల్యే తీరు మార్చుకోవాలని ఆయన విజ్ఞప్తి చేశారు.