అధికంగా వర్తకం చేసిన మార్కెట్లు; 10 వేల మార్కు పైనే నిలిచిన నిఫ్టీ, 329.17 పాయింట్లు పెరిగిన సెన్సెక్స్
అమర్ దేవ్ సింగ్, హె అడ్వైజరీ, ఏంజెల్ బ్రోకింగ్ లిమిటెడ్.
వరుసగా రెండు రోజులు ఎరుపు రంగులో (పతనం దిశగా) వర్తకం చేసిన తరువాత, నేటి ట్రేడింగ్ సెషన్‌లో భారతీయ మార్కెట్లు సానుకూలంగా ముగిశాయి. నిఫ్టీ 0.91% లేదా 94.10 పాయింట్లు పెరిగి 10 వేల మార్కు పైన అంటే, 10,383.00 వద్ద ముగిసింది. ఎస్ అండ్ పి బిఎస్ఇ సెన్సెక్స్ 0.94% లేదా 329.17 పాయింట్లు పెరిగి 35, 171.27 వద్ద ముగిసింది.
సుమారు 1629 షేర్లు పెరిగాయి, 141 షేర్లు మారలేదు, నేటి ట్రేడింగ్ సెషన్‌లో 1040 షేర్లు క్షీణించాయి.
నిఫ్టీ లాభాలలో అగ్రస్థానంలో బిపిసిఎల్ (6.50%), ఇన్ఫోసిస్ (6.64%), టిసిఎస్ (4.92%), ఐఒసి (4.76%), ఇండస్ఇండ్ బ్యాంక్ (3.76%) నిలిచాయి.
బజాజ్ ఫైనాన్స్ (3.09%), ఐటిసి (3.07%), టాటా మోటార్స్ (1.73%), కోటక్ మహీంద్రా బ్యాంక్ (2.35%) నిఫ్టీలో అధిక నష్టాలను చవిచూసాయి.
ఎఫ్‌ఎంసిజి, ఫార్మా తక్కువ స్థాయిలో ముగియగా, ఇతర రంగాలు సానుకూలంగా వర్తకం జరిపాయి.
బిఎస్‌ఇ మిడ్‌క్యాప్ 0.27%, బిఎస్‌ఇ స్మాల్‌క్యాప్ 0.19% పెరిగింది
యుకో బ్యాంక్
గత సంవత్సరంలో నాలుగో త్రైమాసికంలో రూ. 1552 నష్టపోయిన యూకో బ్యాంక్ ఈ సంవత్సరం అదే నాలుగో త్రైమాసికంలో రూ.16.78 కోట్ల నికర లాభం నమోదై, యుకో బ్యాంక్ షేర్లు 15.77 శాతం పెరిగి రూ.16.15 వద్ద ట్రేడ్ అయ్యాయి.
ఆంధ్ర పేపర్
ఈ కంపెనీ, నాన్-రీటైల్ విభాగం కొరకు 3.34 రెట్ల డిమాండ్ ను అందుకున్న తరువాత దీని స్టాక్ 7.25% పెరిగి తరువాత రూ. 212.30 ల వద్ద ట్రేడ్ అయింది.
ఇమామి
నాల్గవ త్రైమాసికంలో ఈ సంస్థ యొక్క నికర లాభాలు 59.4% తగ్గాయి, ఆదాయం 16.8% తగ్గింది. అయినప్పటికీ కంపెనీ షేర్లు 0.66% పెరిగి రూ. 222,00 ల వద్ద ట్రేడ్ అయ్యాయి.
అశోక్ లేలాండ్
నాల్గవ త్రైమాసికంలో కంపెనీ బలహీనమైన ఆదాయాన్ని నివేదించింది. ఫలితంగా కంపెనీ స్టాక్స్ 2.62% తగ్గి రూ. 52,05 వద్ద ట్రేడ్ అయింది.
ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్
నేటి వాణిజ్య సెషన్‌లో 10 శాతం ఎగువ సర్క్యూట్లో ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ వాటా 9.62% పెరిగి రూ 13.10 ల వద్ద నిలిచింది. స్టాక్ ధర పెరుగుదల సంస్థ యొక్క నాలుగవ త్రైమాసిక ఆదాయాల ఫలితంగా ఉంది.
కజారియా సెరామిక్స్
నాల్గవ త్రైమాసికంలో ఏకీకృత నికర లాభంలో కంపెనీ 27.1% క్షీణతను నివేదించిన తరువాత కంపెనీ స్టాక్ 0.83% తగ్గి రూ. 398.00ల వద్ద ట్రేడ్ అయింది. ఈ సంస్థ ఆదాయం కూడా 20% తగ్గింది.
ఐఆర్‌సిటిసి
ఏప్రిల్-జూన్ త్రైమాసికంలో దాని ఆదాయాలు మరియు లాభాలు ప్రతికూలంగా ప్రభావితమయ్యే అవకాశం ఉందని కంపెనీ ప్రకటించిన తరువాత, ఐఆర్‌సిటిసి స్టాక్ 1.94% తగ్గి రూ. 1385.00 ల వద్ద ట్రేడ్ అయింది.
ఆర్ఐఎల్
ఆయిల్-టు-టెలికాం సమ్మేళనాల ఫిచ్ రేటింగ్స్ అప్‌గ్రేడ్ అయిన తరువాత రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ షేర్లు 1.87% పెరిగి రూ. 1750.00 ల వద్ద ట్రేడ్ అయ్యాయి.
భారతీయ రూపాయి
భారత రూపాయి స్వల్ప మార్పుతో ముగిసినప్పటికీ, నేటి ట్రేడింగ్ సెషన్లో ఇది ఎక్కువగా ట్రేడవుతూనే ఉంది. భారత రూపాయి నేడు, యుఎస్ డాలర్‌తో 75.64 రూపాయలుగా ముగిసింది.
బంగారం
పెరుగుతున్న కరోనావైరస్ కేసుల నేపథ్యంలో, బంగారం వరుసగా మూడవ రోజు అధికంగా వర్తకం చేసింది. బంగారం ధరలు హెచ్చుతగ్గులకు గురైనప్పటికీ స్పాట్ బంగారం 1760.73 అమెరికన్ డాలర్ల వద్ద స్థిరంగా ఉంది.
గ్లోబల్ మార్కెట్ సానుకూల వర్తకం
ప్రపంచంలోని వివిధ ప్రాంతాలలో పెరుగుతున్న కోవిడ్ -19 కేసుల నడుమ గ్లోబల్ మార్కెట్ నేడు అధికంగా వర్తకం చేసింది. నాస్‌డాక్ 1.09%, ఎఫ్‌టిఎస్‌ఇ 100 1.72%, ఎఫ్‌టిఎస్‌ఇ ఎంఐబి 1.52 శాతం, నిక్కీ 225 1.13 శాతం, హాంగ్ సెంగ్ 0.93 శాతం తగ్గాయి.