గల్వాన్ ఘటనపై చైనాలో ప్రభుత్వం పై వ్యతిరేఖతలు

గల్వాన్ సంఘటన విషయంలొ మొదటిసారి చైనాలొ జిన్‌పింగ్ ప్రభుత్వంపై పెద్ద ఎత్తున వ్యతిరేకతలు ప్రారంభమయ్యాయి …. చైనీస్ సోషల్ మీడియా ద్వారా చైనా ప్రజలు తమ వ్యతిరేకతను వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా చైనీస్ ట్విట్టర్ అయిన Weiboలో భారత్, తమ సైనికులకు గొప్పగా నివాళ్ళులు అర్పించిందని, వారిని యుద్ధ వీరులుగా కొనియాడిందని చైనా నెటిజన్లు ఇండియన్ మీడియా లింకులను విసృతంగా పోస్టులు చేస్తుండటం ఆశ్చ్యర్యకరమైన విషయం… కాని చైనా తమ సైనికుల మరణాలను దాచిపెడుతుందని, అసలు బోర్డర్ లో తమ సైనికులు ఏలా ఉన్నారో కూడా చైనా కమ్యూనిస్టు ప్రభుత్వంకు తెలియదని చైనీస్ నెటిజన్లు ఆ దేశ ప్రభుత్వం పై విరుచుకుపడుతున్నారు.