బీజేపీని టార్గెట్ చేసిన మంత్రి ఈటెల‌

క‌రోనా విష‌యంలో కేంద్రానికి, రాష్ట్ర్ట్రానికి మ‌ధ్య పొస‌గ‌డం లేదు. గ‌త కొన్ని రోజులుగా తెలంగాణ స‌ర్కార్ , బీజేపీ ప్ర‌భుత్వాన్ని ల‌క్ష్యంగా చేసుకొని విమ‌ర్శలు చేస్తోంది. ఇటీవ‌ల మంత్రి ఈటెల రాజేంద‌ర్ కరోనా వైరస్‌ నియంత్రణ కోసం కేంద్ర ప్రభుత్వం నిధులు విడుదల చేయలేదని ఆందోళన వ్యక్తం చేశారు. కరోనాపై యుద్ధమంటూ కేంద్రం మాటలకే పరిమితమైందని, చప్పట్లు కొట్టమంటూ, దీపాలు పెట్టమంటూ సుద్దులు చెప్పి పైసలివ్వకుండా చేతులు దులుపుకుందని మండిపడ్డారు. కోవిడ్‌–19 నియంత్రణ కోసం కమిట్మెంట్‌తో పనిచేస్తుంటే కొందరు నాయకులు ధర్నాల పేరుతో చిల్లర రాజకీయాలు చేస్తున్నారని విమర్శించారు.