ఘట్‌కేసర్ ప్రజల మనోభావాలను కాపాడండి : బంజరంగ్ దళ్ సేవ సమితి
ఘట్‌కేసర్ ప్రజల మనోభావాలను కాపాడాల్సిన బాధ్యత పోలీసుల మీద ఉందని బంజరంగ్‌దళ్ సేవ సమితి మేడ్చల్ జిల్లా కో-కన్వీనర్ పసూలది చంద్రశేఖర్ అన్నారు. హిందువుల మనోభావాలు దెబ్బతీసేలా ఇప్పటికే బంగారు మైసమ్మ గుడిలో పలు సంఘటనలు చోటు చేసుకున్నాయని తెలిపారు. గతంలో గట్టు మైసమ్మ గుడిలో అమ్మవారి ముఖంపై కటింగ్ మిషన్‌తో తల భాగాన్ని కట్ చేసి, విగ్రహాలు దొంగతనం చేశారు, పోలీసులకు పిరాధ్యు చేసినా… ఇప్పటి వరకు దొంగలను పట్టుకోలేదని మండిపడ్డారు. మళ్లీ మత్మోనాదులు ఘట్‌కేసర్ ప్రజల, హిందువుల మనోభావాలను కించపరిచేలా అమ్మవారి గుడిపై, గుడి ముందు మలమూత్రాలను బకట్‌తో తీసుకువచ్చి చల్లడం శోచనీయమన్నారు. దీనిపై పోలీసులు తక్షణమే స్పందించి ఆగంతుకుడిని పట్టుకోవాలని డిమాండ్ చేశారు. ఇందుకు సంబంధించిన సీసీటీవీ ఫుటేజి తమ వద్ద ఉందని తెలిపారు. ఇలా పోలీసులు చూసి చూడనట్టు ఉంటే ఆగంతుకులు మరిన్ని ఘటనలకు పాల్పడే అవకాశం ఉందని అన్నారు. దయచేసి వెంటనే దోషులను శిక్షించాలని మరొకసారి కోరుచున్నాము, ఇకనైన బంగారు మైసమ్మ గుడికి తగిన భధ్రత కల్పించాలని ఆయన పోలీసులకు కోరారు.