ఇక లౌక్‌డౌన్ ఉండదు – ఇప్పుడు అన్‌లౌక్ 1.0
దేశంలో మళ్లీ లాక్‌డౌన్ విధిస్తారనే వదంతులు వినిపిస్తున్నాయని, దీనిపై స్పష్టతనివ్వాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు చేసిన విజ్ఞప్తికి ప్రధానమంత్రి నరేంద్రమోదీ స్పందించారు. దేశంలో లాక్‌డౌన్‌ల దశ ముగిసి, అన్‌లాక్ దశ ప్రారంభమైందని ప్రధానమంత్రి బదులిచ్చారు. ప్రధానమంత్రి నరేంద్రమోదీ బుధవారం నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో ముఖ్యమంత్రి కేసీఆర్ మాట్లాడారు. ‘దేశంలో మళ్లీ లాక్‌డౌన్ విధిస్తారనే ప్రచారం జరుగుతోంది. ప్రధానమంత్రి మీడియాతో మాట్లాడుతున్నారనగానే లాక్‌డౌన్ ప్రకటిస్తారని అనుకుంటున్నారు. ప్రధానమంత్రి అందరు ముఖ్యమంత్రులతో మాట్లాడకుండా లాక్‌డౌన్ విషయంలో నిర్ణ యం తీసుకోరని నేను చెబుతున్నాను. దీనిపై స్పష్టత ఇవ్వండి’అని ముఖ్యమంత్రి కేసీఆర్ కోరారు. దీనికి ప్రధాని మోదీ స్పందించారు. ‘దేశంలో మళ్లీ లాక్‌డౌన్ ఉండదు. నాలుగు దశల లాక్‌డౌన్ ముగిసింది. అన్‌లాక్ 1.0 నడుస్తోంది. అన్‌లాక్ 2.0 ఎలా అమలు చేయాలనేదే మనమంతా చర్చించుకోవాలి’అని ప్రధాని స్పష్టం చేశారు.