11 రోజుల‌లో 6 రూపాయ‌లు పెరిగి‌న పెట్రోలు ధ‌ర‌లు

ఓ వైపు క‌రోనా ముప్పు, లౌక్‌డౌన్ క‌ష్టాలు ఇవే సామాన్యుడిని చంపెస్తున్నాయి అనుకుంటున్నాయి. సామాన్యుడి క‌ష్టాన్ని తెలియ‌కుండా పైసా పైసా లాగేస్తోంద ప్రెటోల్ ధ‌ర‌లు. ఇప్ప‌టికే డ‌బ్బులు లేక ప్ర‌జ‌లు ఇబ్బంది ప‌డుతుంటే… ప్ర‌జ‌ల‌పై ప్రెటోల్ ధ‌ర‌లు కొలుకొకుండా చేస్తున్నాయి.
పెట్రోల్, డీజిల్ ధరలు బుధవారం కూడా పెరిగాయి. పెట్రోలుపై 55 పైసలు, డీజిలు పై 60పైసలు చొప్పున ప్రభుత్వ రంగ చమురు కంపెనీలు ధరలను పెంచాయి. ఇంధన ధరలు వరుసగా పెరుగుతూ వస్తున్నాయి. తాజా పెంపుతో గత 11 రోజులుగా పెట్రోలు పై రూ. 6.02, డీజిల్ పై రూ. 6.40 పైసలు పెరిగినట్టయింది.
ప్రధాన నగరాల్లో పెట్రోలు, డీజిలు ధరలు లీటరుకు
న్యూఢిల్లీ : పెట్రోలు ధర రూ. 77.28, డీజిల్ రూ.75.79
ముంబై : పెట్రోలు ధర రూ. 84.15, డీజిల్ రూ.74.32
చెన్నై: పెట్రోలు ధర రూ. 80.86 డీజిల్ రూ.73.69
హైదరాబాద్ : పెట్రోలు ధర రూ.80.22, డీజిల్ రూ.74.07
అమరావతి : పెట్రోలు ధర రూ. 80.66 డీజిల్ రూ.74.54