మెదక్ లో విజృంభిస్తున్న కరోనా
కరోనా వ్యాధి మెదక్ జిల్లాలో చాపకింద నీరులా పాకుతుంది. వైరస్ వచ్చిన మొదట్లో మెదక్ లో మాత్రమే పాజిటివ్ కేసులు వచ్చాయి. ఆ తరువాత ఎక్కడ కూడా కరోనా కేసులు లేకపోవడంతో ప్రజలు ఊపిరి పీల్చుకున్నారు. కానీ లాక్ డౌన్ సడలింపులతో వైరస్ మళ్ళీ పంజా విసురుతోంది. చేగుంట, పాపన్నపేట, తూప్రాన్ లో ఇటీవల కేసులు నమోదు అయ్యాయి. మరో రెండు కేసులు రావడంతో జిల్లా ప్రజలు భయం గుప్పిటిలో ఉన్నారు. అసలే వ్యవసాయం పనులు ప్రారంభించే సమయం వివిధ పనుల మీద మండల, జిల్లా పట్టణాలు రాకపోకలు సాగిస్తుంటారు. ప్రజలు సామజిక దూరం పాటిస్తూ , అన్ని జాగ్రత్తలు తీసుకోవాలి అధికారు సూచిస్తున్నారు. అవసరం ఉంటే తప్ప ప్రయాణాలు చేయవద్దని తెలిపారు.