తూప్రాన్‌లో కరోన కలకలం
డెక్కన్ న్యూస్, మెదక్ ప్రతినిధి, శ్రీకాంత్‌చారి
కరోనా హైదరాబాద్ దాటి పొరుగు జిల్లాలకు వ్యాప్తి చెందుతోంది. ఇప్పటటికే మెదక్ జిల్లాలో నాలుగు పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. ఇవాళ తూప్రాన్‌లో కరోన కలకలం సృష్టించింది. తూప్రాన్ మున్సిపల్ వాటర్ మెన్ కి కరోనా పాజిటివ్ నిర్ధారణ కావడంతో వారి కుటుంబ సభ్యులను హోమ్ క్వారెంటెన్ చేశారు వైద్యలు. ఛాతీలో నొప్పితో ఆసుపత్రిలో చేరిన అతనికి కరోనా పరీక్షలు నిర్వహించాగా పాజిటివ్ గా ఉన్నట్లు గాంధీ ఆస్పత్రి వైద్యులు వెల్లడించారు. దీంతో పట్టణంలో ఆందోళన మొదలైంది. అతను ఎవరెవరిని కలిశారు. ఎక్కువుగా ఎవరితో సన్నిహితంగా ఉన్నారు అనే కోణంలో పోలీసులు, వైద్యులు ఆరా తీసుకున్నారు. ఇటీవల చేగుంటలో కరోనా రావడంతో అక్కడి ప్రజలు భయపడినట్టే నిత్యం వివిధ రకాల పనుల మీద తూప్రాన్ కి వచ్చే వారు భయందోళనలో ఉన్నారు. అసలే వానాకాలం మొదలుకావడం, వ్యవసాయ పనలు ప్రారంభం కావడంతో విత్తనాలు, ఎరువులు, వివిధ రకలైన పనుల మీద ఎక్కువగా రైతులు, సామన్య ప్రజలు వందల మంది రోజు ప్రయాణాలు సాగిస్తారు. దీంతో ప్రతి ఒక్కరూ కూడా జాగ్రత్త వహిస్తూ… ఉండాలని అధికారులు చెబుతున్నారు.