ధరిపల్లిలో తడిపొడి చెత్తను పద్దతిని పరిశీలించిన అధికారులు
డెక్కన్ న్యూస్ ప్రతినిధి, శ్రీకాంత్ చారి
తడిపొడి చెత్తను వేరుగా ఉంచడం వల్ల అనేక ప్రయోజనాలు దాగి ఉన్నాయని మండల అధికారులు తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం సూచించిన సూచనల మేరకు ప్రతి ఒక్కరూ కూడా ఇంట్లో చెత్త, లేద బయట చెత్తను తడి, పొడి చెత్తగా వేరు చేసి పంచయాతీ సిబ్బందికి ఇవ్వాలని సూచించారు. తడిపొడి చెత్తను గ్రామల్లో ఎలా అమలు చేస్తున్నారో… అనే కార్యక్రమంలో ధరిపల్లో మండల అధికారులు పరిశీలించారు. చెత్తను వేరు పద్దతులను కూడా వివరించారు. ఈ చెత్తద్వారా సేంద్రియ ఎరువులు ఉత్సత్తి చేయవచ్చని వాటిని ద్వారా పంటలకు ఉపయోగిస్తే…. అధిక దిగుబుడులు వస్తాయని తెలిపారు. ఈ పద్దతిని ప్రతి ఒక్క కుటుంబం పాటించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ సిద్ధిరాంరెడ్డి, వార్డు సభ్యులు, గ్రామ ప్రజలు పాల్గొన్నారు.











