చెప్పిన పంట వేశాకే రైతుబంధు ?

  • రైతు, స‌ర్కార్ ఇద్దరికి న‌ష్ట‌మే

విప‌క్షాలు చెప్ప‌న‌ట్టుగానే జ‌రుగుతుంది. తెలంగాణ‌లో రైతుబంధు ప‌త‌కానికి మంగ‌ళం పాడ‌డానికి ప్ర‌భుత్వం సిద్ధ‌మైన‌ట్లు తెలుస్తోంది. స‌ర్కార్ చెప్పిన పంట వేశాకే రైతుబంధు పైస‌లు వారి ఖాతాలో వేయాల‌ని నిర్ణ‌యించిన‌ట్టు స‌మాచారం. దీంతో రైతులు కారు, స‌ర్కార్‌పై పెట్టుకున్న రైత‌న్న ఆశ‌లు గంగ‌లో క‌లిసినట్టే…. రైతులు త‌మ భూముల‌కు స‌రిప‌డ పంట‌లు వేస్తారు కానీ… స‌ర్కార్ చెప్పిన‌ట్టు వేస్తు పంట దిగుబ‌డులు వ‌చ్చే అవ‌కాశం ఉండ‌దు. కాగా ఆలా చేస్తే…ఇటు రైతు, అటు స‌ర్కార్ ఇద్ద‌రు న‌ష్ట‌పోయో అవ‌కాశం ఉంది. రైతుల‌కు ముందుగా పెట్టుబ‌డి కోసం డ‌బ్బులు లేక‌పోతే బ‌య‌ట నుండి అప్పులు తీసుక‌రావాల్సిందే… స‌ర్కార్ చెప్పిన‌ట్టు పంట వేశారు అనుకుందాం. అప్పుడు స‌రైన దిగుబ‌డి రాక‌… పెట్టుబ‌డి మెత్తం న‌ష్ట‌పోయో అవ‌కాశం ఉంది. దీంతో ప్ర‌భుత్వం ఇచ్చిన రైతుబంధు డ‌బ్బులు, రైతు అప్పు చేసి పెట్టుబ‌డి పెట్టిన ఇద్ద‌రి డ‌బ్బులు మ‌ట్టిలో క‌ల‌పాల్సిందే.
రైతుబంధు కోసం సర్కారు 2020-21 సీజన్‌కు గాను బడ్జెట్‌లో రూ.7వేల కోట్లు కేటాయించింది. ఇందులో సగం రూ.3,501 కోట్ల నిధులను ఆర్థిక శాఖ నుంచి వ్యవసాయ శాఖకు బదిలీ చేయగా ఎస్‌బీఐ మెయిన్‌ బ్రాంచిలో రైతుబంధు ఖాతాల్లో ఆ డబ్బులు జమ చేశారు. ఈ నిధులను ఇప్పటికిప్పుడే రైతుల ఖాతాలకు జమచేసే పరిస్థితి లేదు. సాగులెక్కలు, రైతువారీగా సాగుచేసే పంటల వివరాలు కొలిక్కివచ్చిన తర్వాతే రైతుబంధు డబ్బులు చెల్లించే అవకాశాలున్నాయి.