మరో సారి మానవత్వం చాటుకున్న రాజశేఖర్ రెడ్డి:
మనిషికి మనిషి సహాయపడడమే మానవత్వం. నీవు… చిన్న పెద్ద అంటూ తారతమ్యం చూపిస్తే… మనిషి పుట్టకలో అర్ధమే లేదు. ప్రతి ఒక్క మనిషికి వేరొక మనిషితో ఏదో ఒక రూపంలో పని పడుతుంది. అలాంటప్పుడే ఆపదలో ఉన్నవారిని ఆదుకుంటే వారు జీవితాంతం గుర్తు పెట్టుకుంటున్నారు. మనసులో ఎలాంటి భేషజాలు పెట్టుకొకుండా ఎప్పుడూ పరులకు సేవ చేయాలనే ఆలోచనలో కొంత మంది ఉంటారు. అలాంటి కోవకు చెందిన వారే ధరిపల్లి గ్రామానికి చెందిన వీరయ్యగారి రాజశేఖర్‌రెడ్డి. అతని గురించి తెలుసుకోవాలంటే ఈ కథనం చదవాల్సిందే…
వయసులో చిన్నోడే…. గట్టిగా 30 ఏళ్లు కూడా లేవు. చిన్నప్పటి నుండే సేవమార్గంలో ఉంటూ అందరికీ సహాయం చేస్తుండేవారు. రాజశేఖర్‌రెడ్డి ఇటీవల ప్రత్యక్షంగా రాష్ట్ర మంత్రులతో మాట్లాడి ఆపదలో ఉన్న గ్రామ ప్రజలకు సహాయం చేశారు. అలాగే పేదరికంలో ఉన్న గ్రామానికి చెందిన శ్రీనివాస్ అనే వ్యక్తికి పిత్తాశయం (galbladder) లో రాళ్లు ఏర్పడ్డాయి. వాటి పరిమాణం పెరగటంతో ఆపరేషన్ తప్పనిసరి కాగా, బాధిత కుటుంభం అదే గ్రామానికి చెందిన రాజశేఖర్ రెడ్డి ని ఆశ్రయించారు. దీంతో స్పందించిన అయన పలు ఆసుపత్రుల యాజమాన్యలతో మాట్లాడి దానికి అయ్యే ఖర్చు తెలుసుకోగా దాదాపు లక్షలలో ఖర్చు అవుతుందని తెలిపారు. ఆరోగ్య శ్రీ సేవలు మల్లారెడ్డి ఆసుపత్రిలో తాత్కాలికంగా నిలిపివేయగా, ములుగు మండలంలోని RVM ఆసుపత్రి వైద్యులతో మాట్లాడి ఆరోగ్యశ్రీ ద్వారా ఆపరేషన్ చేయించారు.అంతే కాకా కరోనా నేపథ్యంలో వైద్యులకు ppe kits కోసం బాధితుడి వద్ద 10,000 రూ ఫీ అడగగా రాజశేఖర్ రెడ్డి చొరవతో అది కూడా అధిక మొత్తంలో తగ్గించారు. ఆపరేషన్ తర్వాత కుటుంబ సభ్యులు రాజశేఖర్ రెడ్డి కి ఫోన్ చేసి అతని ఆపరేషన్ విజయవంతం అయిందని సహకరించినందుకు దన్యవాదాలు తెలిపారు. దీంతో కూడా గ్రామ ప్రజలు రాజశేఖర్ రెడ్డిని అభినందించారు. ఇలా ప్రతి ఒక్కరికి సహాయం చేయాలని ప్రజలు కోరారు.











