తిరుమల శ్రీవారి దర్శనానికి మార్గదర్శకాలు
తిరుమల శ్రీవారి దర్శనానికి తితిదే మార్గదర్శకాలను విడుదల చేసింది. శుక్రవారం తిరుమలలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో తితిదే ఛైర్మన్ వై.వి.సుబ్బారెడ్డి వివరాలను వెల్లడించారు.
ఈనెల 8 నుంచి తితిదే ఉద్యోగులతో ప్రయోగాత్మకంగా శ్రీవారి దర్శనాలు ప్రారంభిస్తున్నట్లు తెలిపారు. వివిధ ప్రాంతాల్లో జరుగుతున్న లడ్డూల విక్రయం ఈనెల 8 నుంచి నిలిపివేస్తున్నట్టు చెప్పారు.
ఈనెల 8, 9న కొంత మంది గుర్తింపు పొందిన తితిదే ఉద్యోగులకు స్వామివారి దర్శనం.
10న స్థానిక భక్తులకు అనుమతి, 11 నుంచి దేశ వ్యాప్తంగా వచ్చే భక్తులకు అనుమతి.
రోజూ సుమారు 3వేల ఆన్‌లైన్ టికెట్లు అందుబాటులోకి.
కంటైన్‌మెంట్ జోన్ల నుంచి భక్తులు తిరుమలకు రావొద్దు.
ఆన్‌లైన్‌లో టికెట్లు బుక్‌చేసుకున్న వారికి అలిపిరిలో పరీక్షలు, 65 ఏళ్లు పైబడిన వారు, పిల్లలకు అనుమతి నిరాకరణ, మాస్క్‌లు తప్పనిసరి, భౌతికదూరం పాటించాలి.
ప్రతి రోజు ఉదయం 6.30 నుంచి రాత్రి 7.30గంటల వరకు మాత్రమే భక్తులకు అనుమతి. ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 4 వరకు అలిపిరి నడకదారిలో భక్తులకు అనుమతి.
వసతి గదుల్లో రెండో రోజు కొనసాగేందుకు అనుమతి ఉండదు. వసతి గదిలో ఇద్దరికి మాత్రమే అనుమతి.
క్యూలైన్లను ప్రతి రెండు గంటలకోసారి శానిటైజ్ చేస్తారు. శ్రీవారి ఆలయంలోని ఉపాలయాల దర్శనం ఉండదు.
వైరస్ ప్రబలే అవకాశం ఉన్నందున శఠారి, తీర్థం ఇవ్వరు. శ్రీవారి పుష్కరిణిలో స్నానాలకు భక్తులను అనుమతించరు.
ఆన్‌లైన్‌లో టికెట్ బుక్ చేసుకున్నా… వైద్య పరీక్షలు నిర్వహించాకే అనుమతి. శ్రీవారి హుండీ వద్దకు వెళ్లే వారికి హెర్బల్ శానిటైజేషన్ ప్రక్రియ.
శ్రీవారి హుండీలో కానుకలు వేసేటప్పుడు జాగ్రత్తలు పాటించాలి. తిరుమలలో ప్రైవేటు హోటళ్లకు అనుమతి నిరాకరణ
శ్రీవారి మెట్టు మార్గం ద్వారా కొన్నాళ్ల పాటు అనుమతి ఉండదు, 11 నుంచి ఉదయం 6.30 నుంచి 7.30 వరకు మాత్రమే వీఐపీ బ్రేక్ దర్శనాలు