తెలంగాణలో కరోనాకి వైఫై సిగ్నల్ దొరికిందా ?
తెలంగాణలో కరోనా విస్తరిస్తున్న తీరు చూస్తుంటే… వైరస్‌కి వైఫై సిగ్నల్ దొరికినట్టు ఉంది. ఎన్ని కట్టడి మార్గాలు చేసిన ఆగడం లేదు. విస్తృతంగా కరోనా కేసులు పెరుగుతూనే ఉన్నాయి. ప్రతి వెయ్యి కేసుల పెరుగుదల చూసుకంటే వైరస్ వ్యాప్తి ఎంత వేగంగా జరుగుతుందో మనకు అర్ధం అవుతుంది.
మార్చి నెలలో 93 , ఏప్రిల్ నెలలో 943 , మే నెలలో 1660 , జూన్ ౩వ తేదీ వరకు 322 కేసులు నమోదు అయ్యాయి. కాగా మొదటి వెయ్యి కేసులు 56 రోజులు, రెండవ వెయ్యి 31 , మూడవ వెయ్యి 7 రోజులలో నమోదు అయ్యాయి. ఈ సంఖ్యలను బట్టి చూసుకుంటే మనకు అర్ధం అవుతుంది ఎంత వేగంగా వైరస్ వ్యాప్తి చెందుతుందో. మరణాలు చుకుంటే 99 మంది మృతి చెందారు.
ఈ లెక్కలు సరే కానీ ప్రభుత్వం సరైన లెక్కలు చూపడం లేదు అని విపక్షాలు, ప్రజలు ఆరోపిస్తున్నారు. వారి ఆరోపణలు నిజమైతే మరిన్ని కేసులు పెరిగే అవకాశం ఉంది. మరో నెలలో 60 వేల కేసులు దాటే అవకాశం ఉందని ఆరోగ్య అధికారులు అనుకుంటున్నారని సమాచారం.