నిబంధనలు తుంగలో తొక్కుతున్న మాసాజ్ సెంటర్లు
హైదరాబాద్…సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో వందల సంఖ్యలో స్పాలు కొనసాగుతున్నాయి. అలసిన శరీరానికి సాంత్వన కలిగించేందుకు మసాజ్ ఎంతగానో తోడ్పడుతుంది. ఈ మసాజ్ ను ఆసరా చేసుకున్న స్పాలు అడ్డదారులు తొక్కుతున్నాయి. స్పా సెంటర్లలో అమ్మాయిలతో పురుషులకు క్రాస్ మసాజ్ చేయిస్తున్నారు. ప్యాకేజీని బట్టి సర్వీస్ అందిస్తూ అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడుతున్నారు. ప్రతీ స్పాలో టాప్ లెస్…బాడీ టూ బాడీ కామన్ గా మారింది. ఇక కొన్ని స్పాలలో ఫుల్ సర్వీస్ అంటూ సెక్స్ నడిపిస్తున్న దాఖలాలు ఉన్నాయి. హైదరాబాద్ పరిధిలో టాస్క్ ఫోర్స్ పోలీసులు…సైబరాబాద్ పరిధిలో ఎస్వోటీ పోలీసులు ఎప్పటికప్పుడు దాడులు చేస్తూనే ఉన్నారు. అయినా స్పా నిర్వాహకులు మాత్రం కస్టమర్లను అమ్మాయిలతో ఆకర్షిస్తూ దర్జాగా దందా కొనసాగిస్తూనే ఉన్నారు. నిబంధనలు ఉల్లంఘిస్తున్న స్పా సెంటర్ల నిర్వాహకులపై పోలీసులు కఠిన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. లేదంటే స్పాల తీరు మారే అవకాశమే లేదు. కరోనాను కట్టడి చేయలేము.











