జూన్ 1 నే కేరళకు తొలకరి పలకరింపు

నైరుతి రుతుపతనాలు జూన్ 1 న కేరళను తాకుతాయని IMD తాజా బులెటిన్ వెల్లడించింది. ఇప్పటికే కేరళకు దక్షిణంగా ఉన్న మాల్దీవులపై రుతుపవనాలు విస్తరించి భారీ వర్షాలు కురుస్తున్నాయి. పశ్చిమ మధ్య అరేబియా సముద్రంలో అల్పపీడనం ఏర్పడటం మాన్సూన్ కదలికకు అనుకూలంగా మారింది. మొన్నటి Amphon సూపర్ సైక్లోన్ కూడా రుతుపవనాలు సకాలంలో రావడానికి సహాయపడింది. రాయలసీమ, తెలంగాణాలను జూన్ 7-10 మధ్య ఎప్పుడైనా రుతుపవనాలు పలకరిస్తాయి. ఒక రోజు అటుఇటుగా కోస్తాంధ్రలో కూడా తొలకరి వర్షాలు మొదలవుతాయి. జూన్ 5 నుంచి పాక్షికంగా మేఘాలు అలుముకుని వాతావరణం ఆహ్లాదంగా మారుతుంది.