రైతుబంధు ప‌త‌కానికి మంగ‌ళం పాడ‌డానికేనా ? తెజాస

మద్దతు ధర చెప్పకుండా రహస్య ప్రతిజ్ఞలు ఎందుకు : రాజశేఖర్ రెడ్డి ధ్వజం

డెక్క‌న్ న్యూస్, మెద‌క్ ప్ర‌తినిధి శ్రీకాంత్ చారి

రాష్ట్ర ప్ర‌భుత్వం సూచ‌న‌లు రైతుల క‌న్నీరు తుడ్వ‌లేద‌ని తెలంగాణ జ‌న స‌మితి పార్టీ యువ‌జ‌న విభాగం మెద‌క్ జిల్లా అధ్య‌క్షుడు
రాజ‌శ‌వేఖ‌ర్ రెడ్డి మండి పడ్డారు. వాన‌కాలంలో డిమాండ్ ఉన్న పంట‌లు వేయ‌మ‌న‌డం అనేది త‌గిన నిర్ణ‌యం కాద‌న్నారు. ఒక్కొక్క జిల్లాలో ఒక్కొక్క రక‌మైన భూములు ఉంటాయ‌ని ప్ర‌భుత్వం చెప్పిన పంట‌లు రైతులు సాగుచేయ‌డం సాధ్య‌మైన ప‌ని కాద‌న్నారు. పై అదికారుల సూచ‌న‌ల‌ల మేర‌కు వ్య‌వ‌సాయ అధికారులు గ్రామ‌ల్లోకి వెళ్లి బ‌ల‌వంతంగా సంతాకాలు చేపిస్తున్నార‌ని ఆరోపించారు. ప్ర‌జ‌ల‌కు అనుకుల‌మైన పంట‌లు మాత్ర‌మే పండిస్తార‌ని అన‌వ‌స‌ర‌మైన తీర్మానాలు ఎందుకు అని ప్ర‌భుత్వాన్ని ప్ర‌శ్నించారు. ఇప్పుడు సంత‌కాలు స‌రేకానీ పంట చేతికొచ్చినాక మ‌ద్ద‌తు ధ‌ర‌కు ఎవ‌రు బాధ్య‌త వ‌హిస్తార‌ని అధికారుల‌ను ప్ర‌శ్నించారు. మద్దతు ధర ప్రకటించి రైతుకు భరోసా ఇస్తే తప్ప సన్న రకం వరి సాగు చేసే సాహసం రైతులు చేయబోరు అని దానికి తగు మద్దతు ధర 2800 క్వింటల్ కి చెల్లించాలని ఆయన డిమాండ్ చేసారు .ప్రభుత్వం మద్దతు ధర విషయం అడిగితే కేంద్రం సాకు చెబుతుందని, మరి పంటల పై నియంత్రణ మాత్రం రాష్ట్ర ప్రభుత్వం చేతిలో ఎలా ఉంటుందని ఆయన మండిపడ్డారు.
ముఖ్య‌మంత్రి కేసీఆర్ కూడా త‌న ఫాం హౌస్‌లో ఎలాంటి పంట‌లు పండిస్తారో ప్ర‌జ‌ల‌కు తెలియజేయాల‌ని డిమాండ్ చేశారు. అంతేకానీ చెప్పిన పంట వేయ‌క‌పోతే రైతుబంధు ప‌త‌కం బంద్ చేస్తామ‌ని బ్లాక్ మెయిల్ రాజ‌కీయాలు చేస్తున్నార‌ని అన్నారు. నిజానికి రైతు బంధు ప‌త‌కానికి మంగ‌ళం పాడ‌డానికే ఈ సూచ‌న‌లా అని ప్ర‌శ్నించారు. రైతుల‌కు ప్ర‌భుత్వ సూచ‌న‌లు న్యాయం చేసేలా ఉండాలి కానీ అన్యాయం చేసేలా ఉండ‌కూద‌ని హిత‌వు ప‌లికారు.