ధరిపల్లిలో ప్రతిజ్ఞ చేసిన రైతులు

రాష్ట్ర ప్రభుత్వం అన్ని గ్రామాలలో డిమాండ్ ఉన్న పంటలు వేయాలని సూచించింది. మెదక్ జిల్లా ధరిపల్లిలో అధికారుల సూచనల మేరకు రైతులు పంటలు వేయడానికి సిద్ధమయ్యారు. ఇందులోభాగంగా చిన్న శంకరంపేట మండల అధికారులు రైతులకు పలు సూచనలు చేసారు. ఎలాంటి పంటలు వేస్తే అధిక దిగుబడులు వస్తాయి అని.. అలాగే తక్కువ నీరుతో ఎక్కువ ఆదాయం వచ్చే పంటలు గురించి వివరించారు. మరి కొన్ని రోజులలో వానాకాలం పంటలు వేయడానికి రైతులు సిద్ధం అవుతున్న సమయంలో మొక్క జొన్న పంటలు వేయకుండా సన్న రకాలైన వారి ఇతర పంటలు వేయాలని సూచించారు. అంతే కాకుండా రైతులతో అధికారులు ప్రతిజ్ఞ చేపించారు.