అన్ని ఫ్రీ ఫ్రీ ఫ్రీ అని ప్రభుత్వ ఆలోచన

రైతులకు ఎరువులు ఉచితం
వ్యవసాయానికి కరెంటు ఉచితం
రుణ మాఫీ విత్తనాలు సబ్సిడీ
ఈ ప్రభుత్వంలో రైతులకు అన్నీ ఫ్రీ
వీరికి ఇంకేం కావాలి , అని ప్రజల ఆలోచన
70% వ్యవసాయం పై ఆధార పడ్డవారే , కాని వీరికి ఇంతకంటే ఎక్కువ ఏం కావాలి,

అన్ని ఫ్రీ ఫ్రీ ఫ్రీ అని ప్రభుత్వ ఆలోచన

కానీ నేను ఒక రైతు బిడ్డగా చెబుతున్నా ,
మా రైతులకు ఏది ఫ్రీ ఫ్రీ ఫ్రీ గా ఇవ్వాల్సిన అవసరం లేదు అని విన్నవిస్తున్నా,

ఎందుకంటే ,

అంగన్ వాడి కార్యకర్తలను టీచర్లుగా ఎలా గుర్తించి 4,000 జీతం నుండి 10,000 జీతంగా పెంచావో,
1,500 జీతం ఉన్న సర్పంచ్ జీతం 5,000 చేసావో ,
75,000 జీతం ఉన్న MLA జీతం 1,50,000 చేసావో ,
విపరీతంగా పెంచిన గవర్నమెంటు ఉద్యోగుల జీతాలను ఏ విధంగా పెంచావో ,
అదే విధంగా , అదే శాతంతో సమానంగా రైతు పండించిన పంటకు ధరను నిర్ణయించి , ప్రభుత్వమే కొనుగోలు చెయ్యాలి.
ఎందుకు కొనుగోలు చెయ్యరు ప్రశ్నిద్దాం, పోరాడుదాం

లక్ష రూపాయల జీతం ఉన్న ప్రభుత్వ ఉద్యోగులకు కూడా రోగం వస్తే హాస్పిటల్ లో ట్రీట్మెంట్ ఫ్రీ , అతని పిల్లలకి ఫ్రీ , అతని భార్యకు ఫ్రీ మరియు అతని తల్లిదండ్రులకు కూడా ఫ్రీp
వారికి ఆఫీస్ టైం 9AM to 4:30PM , కచ్చితంగా టైం to టైం వెళతాడు , వస్తాడు.
మరి రైతు లేనిదే రాజ్యం లేదు , రైతే రాజు , రైతు లేకుండా జీవించలేము ,జై జవాన్ జై కిసాన్ , రైతు ఏడ్చిన రాజ్యం లేదు , ఎద్దు ఏడ్చిన ఎవుసం లేదు అని చెపుతున్న రాజకీయ నాయకుల్లారా ,

రాత్రనక , పగలనక , ఏ టైం లేకుండా , ఎప్పుడు పడితే అప్పుడు పొలానికి వెళ్లిన రైతు , తిరిగి వస్తాడో , లేదో తెలియక , ఇంటి దగ్గర ఎదురు చూసే భార్య , పిల్లలు , పంటకు రోగం , మనిషికి రోగం వస్తే ఎక్కడ చూపియ్య లో తెలియక , అప్పు చేసి , దిగుబడి తగ్గి కుంగిపోయే రైతులకు ఇస్తే ఫ్రీ అంటారు, ఉద్యోగులకు ఇస్తే ఇంక్రిమెంట్ అంటారు….నేను షేర్ చేయ్యమని చేప్పను మంచి విషయం అయితే తప్పక షేర్ చేస్తావు

ఇట్లు
ఒక రైతు బిడ్డ