వరి కొయ్యలను కాల్చవద్దు
వరి కోతల తర్వాత కొయ్యలను కాల్చడం మానుకోవాలి రాష్ట్ర ప్రణాళికా సంఘం వైస్ చైర్మన్ బోయినపల్లి వినోద్ కుమార్ అన్నారు. దీని వల్ల పంట భూమిలోని జీవరాసులు చనిపోతాయి ఆయన అన్నారు. వరి కొయ్యలను కాల్చే పద్దతి వల్ల మేలు కన్నా కీడే ఎక్కువ జరుగుతుందని తెలిపారు. వరి కొయ్యలను కాల్చే పద్ధతి వల్ల భూమిలోని క్రీములు, కీటకాలు నాశనం అవుతాయి పేర్కొన్నారు. కొయ్యలను కాల్చడం వల్ల జీవ వైవిధ్యం దెబ్బ తింటుంది అన్నారు. దట్టని పొగ వల్ల రైతుల ఊపిరి తిత్తులకు ప్రమాదం సంభవించే అవకాశం ఉందన్నారు. పర్యావరణానికి కూడా ముప్పు బలొ వాటిల్లనుందని తెలిపారు. వరి కోత తర్వాత మిగిలిన కొయ్యలను చేతితో కానీ, ట్రాక్టర్ లేదా నాగళ్ల ద్వారా పెకిలించి వేయాలి సూచించారు. ఇలాంటి పద్దతి అన్ని రకాలుగా శ్రేయస్కరం అని అన్నారు. వరి కొయ్యలను కాల్చడం వల్ల తక్కువ ఖర్చుతో రైతులకు సరిపోతుంది. ఈ విషయం తెలుసు. కానీ ఇది అనుసరించనీయం కాదన్నారు.