ఎంజీ మోటార్ ఇండియా కాంటాక్ట్ రహిత సాంకేతికత సేవ, ’షీల్డ్+’ ఆవిష్కరణ
తన వినియోగదారులకు నూతన పద్ధతిలో సేవ చేయడానికి సంసిద్ధమవుతున్న ఎంజీ మోటార్ ఇండియా ఈ రోజు తన ‘ఎంజీ షీల్డ్+’ కార్యక్రమాన్ని ఆవిష్కరించింది. విక్రయ మరియు సేవా కార్యక్రమాల సమగ్ర విభాగాన్ని గొడుగు క్రింద అందిస్తున్న షీల్డ్+ అనే కొత్త అంశం, ప్రధానంగా కాంటాక్ట్ ఫ్రీ టెక్నాలజీ, ఇంటి ముంగిటే పంపిణీ సేవలు మరియు మెరుగైన శానిటైజేషన్ పై కీలక దృష్టి కలిగి అందుకు అనుగుణంగా రూపొందించబడింది.
కాంటాక్ట్ రహిత సాంకేతికత క్రింద, ఎంజీ, తన డిజిటల్ కొనసాగింపును, వాయిస్ ఇంటరాక్షన్ ద్వారా మరింత పెంపొందిస్తోంది. ఎంజీ వారి షీల్డ్+ పరిశ్రమ-ప్రముఖ ఎంజీ విపిహెచ్‌వై కలిగి ఉంటుంది మరియు తన వాహనాల వాయిస్-గైడెడ్ ప్రదర్శనను అందిస్తుంది. వినియోగదారులు ఎంజీ కార్ల షోరూంలకు వెళ్ళి, ఆటోమేటెడ్ వాయిస్ సూచనల ద్వారా మార్గనిర్దేశం చేయవచ్చు. ఈ ఉత్పాదన కొనసాగిస్తున్న సమయంలో, వినియోగదారు క్యుఆర్ కోడ్‌లను స్కాన్ చేయదం ద్వారా ఈ వాయిస్-గైడెడ్ అంశ ప్రదర్శనలను స్వీకరించవచ్చు.
కాంటాక్ట్-లెస్ సమర్పణలకు కొనసాగింపుగా, ఎంజీ మోటార్ ఇండియా, ఈ విభాగంలో మొట్టమొదటిగా, ఎంజీ కార్ల ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్‌లకు ఓటిఎ (ఓవర్-ది-ఎయిర్) అప్డేట్స్ ను అందించడం కొనసాగిస్తోంది. వినియోగదారులు తమ MGల ఐ-స్మార్ట్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్ యొక్క సాఫ్ట్‌వేర్‌ను సేవా స్టేషన్‌ను సందర్శించాల్సిన అవసరం లేకుండానే అప్‌గ్రేడ్ చేసుకోగలరు.
ఈ వాహన తయారీదారు తన వినియోగదారులకు, ఎంజీకేర్@హోమ్ ద్వారా, వారి గృహాలలో, పరిశుభ్రత, క్రిమిసంహారకం మరియు ప్యూమిగేషన్ వంటి అనేక శీఘ్ర సేవలను, శిక్షణ పొందిన సాంకేతిక నిపుణుల ద్వారా పొందటానికి వీలుకల్పిస్తుంది. ఈ కార్ల తయారీదారు తన వాహనాలలో, ‘క్రిమిసంహారక మరియు పంపిణీ’ అనే ఉపక్రమంతో, ఎంజెర్మ్ క్లీన్‌తో వాహన క్యాబిన్ ఫ్యూమిగేషన్ కూడా ప్రారంభించింది.
షీల్డ్+ ఆవిష్కరణ సందర్భంగా ఎంజీ మోటార్ ఇండియా చీఫ్ కమర్షియల్ ఆఫీసర్ గౌరవ్ గుప్తా మాట్లాడుతూ, ఇలా అన్నారు “భవిష్యత్ దర్శిని బ్రాండ్‌గా, మేము మెరుగైన వినియోగదారు అనుభవాలను అందించడానికి నిరంతరం సృజనాత్మకత మరియు సాంకేతికపై దృష్టి సారిస్తాము. నవతరంలో, డిజిటల్ మరియు కాంటాక్ట్-లెస్ అనుభవాలు మరింత కీలకమైన పాత్ర పోషిస్తాయి. షీల్డ్+ అనేది ఒక సురక్షిత విక్రయ మరియు సేవల కార్యక్రమం, ఇది మా వినియోగదారులకు పూర్తి సౌలభ్యంతో అందించబడే ఒక కొత్త సదుపాయం మరియు ఇది మా వినియోగదారుల భద్రత పట్ల మాకు గల నిబద్ధతకు నిదర్శనం. ఈ కార్యక్రమంలో వినియోగదారు అనుభవమే ప్రధానంగా ఉంటుంది మరియు ఎంజీలో మూల స్తంభంగా ఉన్న సృజనాత్మకత మరియు సాంకేతికత ద్వారా నడపబడుతుంది.”