వాటిపై ఫలించిన కరోనా వ్యాక్సిన్‌

కరోనా నుండి మానవాలిని రక్షించుకునేందుకు అనేక పరిశోదనలు జరుగుతూనే ఉన్నాయి. వ్యాక్సిన్‌ కోసం ప్రపంచ వ్యాప్తంగా అనేక దేశాలు ఎదురుచూస్తున్నాయి. అయితే వ్యాక్సిన్‌ కనిపెట్టే ప్రక్రియలో ప్రపంచ ప్రఖ్యాత విశ్వవిద్యాలయం ఆక్స్‌ఫర్డ్‌ ఓ అడుగు ముందుకు వేసింది. కోతులపై ఆక్స్‌ఫర్డ్‌ విశ్వవిద్యాలయం చేసిన ప్రయోగం చాలా మెరుగైన ఫలితాన్ని ఇచ్చాయి. దీంతో త్వరలోనే దాన్ని మనుషులపై ప్రయోగించేలా ఏర్పాట్లు చేస్తున్నారు శాత్రవేత్తలు. అంతే కాకుండా ఈ వ్యాక్సిన్‌ వల్ల సైడ్‌ ఎఫెక్ట్స్‌ కూడా గుర్తించలేదు శాస్త్రవెత్తలు. ఈ పరిశోదనలో భాగంగా 12 కోతులపై వ్యాక్సిన్‌ ప్రయోగం చేసారు శాస్త్రవెత్తలు. ఇందులో మొదట వ్యాక్సిన్‌ ఇవ్వని ఆరు కోతులకు కరోనా సోకేలా వైరస్‌కు దగ్గరగా ఉంచారు. మిగిలిన ఆరు కోతులకు వ్యాక్సిన్‌ ఇచ్చి కరోనా సోకేలా వైరస్‌కు దగ్గరగా ఉంచారు. దీంతో వ్యాక్సిన్‌ ఇవ్వని కోతుల్లో వైరస్‌ లక్షణాలు కనపడ్డాయి. దీంతో ఆ కోతులకు వైద్యం అందిస్తున్నారు వైద్యులు. వ్యాక్సిన్‌ ఇచ్చిన కోతులకు కరోనా లక్షణాలు అసలు కాకపోవడం గమనించారు శాస్త్రవెత్తలు. ఈ వ్యాక్సిన్‌ మనుషులపై కూడా విజయవంతమైతే త్వరలోనే ప్రపంచ వ్యాప్తంగా వ్యాక్సిన్‌ అందుబాటులోకి రానుంది. వ్యాక్సిన్‌ పెద్దమొత్తంలో తయారు చేయడానికి కూడా కనీసం 6 నెలల సమయం పడుతుందని అంచనా వేస్తున్నారు శాత్రవేత్తలు.