తెలంగాణలో అందుబాటులో అన్నీ సబ్ రిజిస్ట్రార్ సేవలు

తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అన్నీ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయములు పూర్తి స్థాయిలో పనిచేయుచున్నవి, కార్యాలయములలో దస్తవేజుల రిజిస్ట్రేషన్ లు, స్టాంపుల అమ్మకం, E.C. మొదలగు అన్ని సేవలు అందుబాటులో ఉన్నవి.

దస్తావేజులు రిజిస్ట్రేషన్ చేసుకునేవారు registration.telangana.gov.in అను వెబ్ సైట్ లో పబ్లిక్ డాటా ఎంట్రీ ద్వార వారి దస్తావేజుల వివరములు నమోదు చేసుకొని, స్టాంపు డ్యూటి తదితర సుంఖములు ఆన్ లైన్ లో చెల్లించి, వారు ఏ రోజున రిజిస్ట్రేషన్ చేసుకోదలుచుకున్నారో ఆన్ లైన్ లో స్లాట్ బుక్ చేసుకొని ఆ సమయంలో సంబందిత కార్యాలయమునకు వెల్లగలరు. స్లాట్ బుక్ చేసుకున్న సమయంలో మీకు సంబందిత కార్యాలయమునకు వెళ్లడానికి అనుమతి పత్రం (పాస్) కూడా ఆన్ లైన్ లో లభిస్తుంది. పోలీస్ చెక్ పోస్టుల వద్ద పోలీస్ శాఖ వారు అభ్యంతరం తెలిపినచో అట్టి పాస్ చూపించినచో మీకు వెళ్లడానికి అనుమతి ఇవ్వగలరు.

ఆన్ లైన్ లో నమోదు చేసుకుని, స్టాంపు డ్యూటీ తదితర సుంఖములు చెల్లించి ఏవైనా కారణాల వలన కార్యాలయమునకు వెళ్లలేని యెడల తదుపరి కాలంలో కూడా అట్టి దస్తావేజులు రిజిస్ట్రేషన్ చేయుంచుకోవచ్చును.

భార దృవీకరణ పత్రం (ఇ.సి.) మరియు దస్తావేజు నఖలు “మీ సేవ” నుండి మాత్రమే పొందగలరు లేదా registration.telangana.gov.in వెబ్ సైట్ నుండి ఆన్ లైన్ లో రుసుము చెల్లించి కూడా భార దృవీకరణ పత్రం (ఇ.సి.) మరియు దస్తావేజు నఖలు పొందవచ్చును.

రాష్ట్రం లోని అన్నీ కార్యాలయములలో కరోనా నేపద్యంలో తీసుకోవాలిసిన అన్ని జాగ్రత్తలు అనగా భౌతిక దూరం పాటించడం, కార్యాలయంకు వచ్చే ప్రజలు చేతులు శుభ్రపరచుకోవడానికి నీరు, సబ్బు మరియు శానిటాయిజర్ లను అందుబాటులో ఉంచాలని అందరు సబ్ రిజిస్ట్రార్ గార్లకు లోగడనే అదేశించి ఉన్నాము. కార్యాలయంనకు వచ్చు ప్రజలు తప్పని సరిగా మాస్కు ధరించి రావలయును మరియు భౌతిక దూరం పాటించవలయును.

పైన పేర్కొన్న ఏ సేవలలో ఐనా ఇబ్బందులు ఎదురైనచో రిజిస్ట్రేషన్ శాఖ వారి టోల్ ఫ్రీ నంబర్ 18005994788 కు ఫోన్ చేసి గాని, వాట్సప్ సెల్ నంబర్ 91212 20272 కు వాట్సప్ లో సందేశం పంపి గాని మీ సమస్యను పరిష్కరించుకోవాలని హైదరాబాద్ dig పి. సుబ్బారావు కోరారు