మీడియాలో ఉడుతున్నఉద్యోగాలు

  • అనుకున్నవారికి అండగా ఉంటున్న బ్యూరో చీఫ్ లు

వారంతా ఒకప్పుడు ప్రజల పక్షంలో నిలబడి వివిధ రంగాల్లో ఇబ్బందులు పడుతున్న వారికి బాసటగా నిలిచి వారి తరుపున యాజమాన్యంతో పోరాడారు. పరిశ్రమలో శ్రమ దోపిడీ జరగకుండా హక్కుల కోసం నిలదీసి అడిగి మరి జర్నలిజం విలువలు కాపాడారు. కానీ ఈ కరోనా కష్టకాలంలో వారి ఉద్యోగాలు వారు కాపాడుకోలేకపోతున్నారు. పొమ్మనలేక పొగబెట్టినట్టు…. మీరు రెండు నెలల పాటు ఆగండి అంటూ వారిని రోడ్డున పడేస్తున్నారు. ఆయా ఛానెల్స్ పుట్టిన నాటి నుండి పది సంవత్సరాలకు పైగా వారు అక్కడ పని చేస్తున్నా హోల్డ్ లో ఉండండి అని చెబుతున్నారు. బ్యూరో చీఫ్ ల దగ్గర మంచి సంబంధాలు ఉన్నవారికి మంచి అందండలు ఉంటున్నాయి, వారితో కాస్త అటు ఇటుగా ఉన్నవారి ఉదోగ్యం ఇప్పుడు కష్టాల్లో పడుతోంది. ఇప్పటికే కొన్ని దినపత్రికలు మూసివేయగా… మరి కొన్ని పత్రికలు వేతనంలో కోత పెట్టాయి. ఇప్పుడు ఆ సంప్రదాయం టీవీ ఛానెల్స్ మీద పడింది. అలా ఉదోగ్య భద్రత లేని వారు అకస్మాత్తుగా రోడ్డునపడి కుటుంబ పోషణకరువై ఆత్మహత్యలు చేసుకుంటే… ఆ బ్యూరో చీఫ్ లే బాధ్యత వహిస్తారా… లేదా ఆయా టీవీ ఛానెళ్ల యాజమాన్యం బాధ్యత వహిస్తుందా అనేది ఇప్పుడు ప్రశ్నర్థకంగా మారింది.