సెన్సెక్స్ 261 పాయింట్స్ కంటే ఎక్కువగా పతనం చెందింది, నిఫ్టీ 9,250 కంటే తక్కువగా ముగిసింది; బ్యంకులు మరియు ఎఫ్‌ఎంసిజి స్టాక్స్, మార్కెట్స్ ను క్రిందికి లాగేసాయి.
-అమర్ దేవ్ సింగ్, హెడ్ ఆఫ్ అడ్వైజరీ, ఏంజెల్ బ్రోకింగ్ లిమిటెడ్.
స్టాక్ మార్కెట్లు వరుసగా రెండవరోజున నష్టాలను చవిచూడడం కొనసాగించాయి, ఇందులో సెన్సెక్స్ 261.64 పాయింట్లు లేదా 0.83% పతనం అయి, 31,453.51 వద్ద ముగిసింది. మరొక వైపు, నిఫ్టీ 87.90 పాయింట్లు లేదా 0.95% పతనం అయి, 9,205.60 వద్ద ముగిసింది. రోజులో అత్యధిక స్థాయి నుండి సెన్సెక్ 860 పాయింట్లు పతనం చెందగా, నిఫ్టీ 50 సూచిక, 9,250 మానసిక స్థాయి కంటే తక్కువకు పతనం చెందింది.
నిఫ్టీలోని అన్ని 11 విభాగాల సూచికలు ఎరుపు జండాతో (తీవ్రపతనంతో) ముగిస్తాయి. నిఫ్టీ పి.ఎస్.యు బ్యంకులు 3.3% పతనంతో మార్కెట్ ను పతనం వైపుకు లాగాయి. ఎస్.బి.ఐ. ప్రస్తుతం 170.50 వద్ద ట్రేడింగ్ అవుతోంది, ఇది 4.64% పతనంతో అతి ఎక్కువ నష్టపోయినవాటిలో ఒకటిగా ఉంది.
సెన్సెక్ లోని 30 స్టాక్స్ లో 19 స్టాక్స్ మారెక్ట్ ముగింపు సమయంలో ఎరుపు జండా (తీవ్ర పతనాన్ని) కొనసాగించాయి.
బ్యాంకింగ్ స్టాక్స్
ఈరోజున స్టాక్ మార్కెట్స్ పతనానికి ముఖ్య కారకాలు ఏవంటే, పి.ఎస్.యు బ్యాంకుల యొక్క స్టాక్స్, ఇందులో ఎస్.బి.ఐ. అతిఎక్కువగా పతనమయింది. ఎస్.బి.ఐ. స్టాక్ 4.64% పడిపోయింది మరియు రూ. 170.50 ల వద్ద ముగిసింది. ఇతర బ్యాంకులలో, ఈరోజు మార్కెట్లలో అతిఎక్కువ నష్టపోయినవారు, బజాజ్ ఫైనాన్స్, యాక్సిస్ బ్యాంక్, కోటక్ మహీంద్ర బ్యాంక్ మరియు బజాజ్ ఫిన్ సర్వ్ ఉన్నాయి.
ఈరోజు, నిఫ్టీలోని అత్యంత లాభాలు పొందినవారిలో పవర్ గ్రిడ్ కార్ప్ 2.68% లాభాలతో, ఎం & ఎం 3.21% లాభాలతో మరియు భారతి ఇన్ఫ్రాటెల్ 3.60% లాభాలతో ఉన్నాయి.
ఈ విపత్తులకు ఎప్. ఎం.సి.జి విభాగం మరికొంత జోడించింది
బ్యాంక్ నిఫ్టీతో పాటుగా, మార్కెట్ పనితీరును తగ్గించినది ఎఫ్.ఎంసి.జి విభాగం, ఇందులో, రాడికో ఖైతాన్ అనేది అతిగా పతనం అయింది. దీని స్టాక్ 7.34% తగ్గింది మరియు రూ. 293.35 గా ముగిసింది, దీని తరువాతి స్థానాలలో యునైటెడ్ బ్ర్యూవరీస్, గాడ్ ఫ్రే ఫిలిఫ్స్, మరియు మెక్ లియోడ్ రస్సెల్ ఉన్నాయి.
అయినప్పటికీ, ఎఫ్‌ఎంసిజి విభాగంలోని ప్రముఖ లాభాలను పొందినవారిలో, నాథ్ బయో జీనెస్ 4.99% మార్పుతో ఉంది మరియు దీని ప్రస్తుత ధర రూ. 286.00 లతో ముగిసింది. ఈ విభాగంలోని లాభం పొందినవారిలో ఇతరులలో సాన్వారియా కన్స్యూమర్స్, మారికో, ఇ.ఐ.డి. ప్యారీ, మరియు టాటా కాఫీలు ఉన్నాయి.
లాభాలు చూపుతున్న ఏకమాత్ర విభాగాలలో ఎనర్జీ మరియు ఇన్ఫ్రాలు ఉన్నాయి. రోజు ముగిసే సరికెల్లా, బి.ఎస్.ఇ. మిడ్ క్యాప్ మరియు స్మాల్ క్యాప్ సూచికలు కూడా ఒక్కొక్కటీ 1 శాతం వరకు పతనం చెందాయి. మిడ్ క్యాప్ మరియు స్మాల్ క్యాప్ షేర్లు, నిఫ్టీ మిడ్ క్యాప్ 100 సూచిక 0.7 శాతం మరియు నిఫ్టీ స్మాల్ క్యాప్ సూచిక 1.13 శాతం పతనం చెందడంతో విక్రయ ఒత్తిడిని ఎదుర్కొనడం కొనసాగించాయి.
వీటిల్లో, మార్కెట్ లోని ఇతర లాభదాయకాలలో భారతి ఎయిర్ టెల్ 3.6 శాతం పెరిగింది మరియు రూ. 170.35 ల ధర వద్ద ముగిసింది.
ప్రభుత్వ సడలింపుల ప్రభావం
క్రెడిట్ ఏజెన్సీ ఐ.సి.ఆర్.ఎ ద్వారా జూన్, 2020 త్రైమాస ముగింపు కొరకు ఇవ్వబడిన నివేదికలో, ఈ లాక్ డౌన్ అనేది దేశం యొక్క జి.డి.పి ని సుమారుగా 20 శాతం వరకు కుదించవచ్చని నివేదించబడింది. అయినప్పటికీ, ఈ సంవత్సరం చివరకెల్లా, అనీ సాధారణ స్థితికి చేరుకోబడవచ్చని ఆశించడమైనది.