ఇవాళ కూడా జీరో కేసులే..ఇక మిగిలింది 34 మంది పేషెంట్లు
దేశంలో మొదట కరోనా కేసు నమోదైన రాష్ట్రంలో ఇప్పుడు తగ్గుముఖం పట్టాయి. గత కొన్ని రోజులుగా తగ్గుతున్న కేసులు ఇవాళ ఒక్క కేసు కూడా నమోదు కాలేదు అని కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ తెలిపారు. అంతేకాదు ఇవాళ మరో 61 మంది కరోనా బాధితులు డిశ్చార్జ్ అయ్యారని మీడియా సమావేశంలో వెల్లడించారు. గత నాలుగు రోజుల్లో సున్నా కేసులు నమోదవడం ఇది మూడోసారి. ఆదివారం కూడా ఒక్కకేసు నిర్ధారణ కాలేదు. ఇక ఆ రాష్ట్రంలో కేవలం 34 మంది మాత్రమే పలు ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. ఇప్పటి వరకు కేరళలో మొత్తం 499 పాజిటవ్ కేసులు నమోదు కాగా..సోమవారం సాయంత్రం వరకు 462 మంది కోలుకున్నారు. రాష్ట్రవ్యాప్తంగా ప్రస్తుతం 84 హాట్‌స్పాట్లు ఉన్నాయి. దేశంలో వివిధ రాష్ట్రాల్లో చిక్కుకున్న లక్షన్నరకు పైగా కేరళీయులు రాష్ట్రానికి వచ్చేందుకు సిద్ధంగా ఉన్నారు. ప్రపంచవ్యాప్తంగా వివిద దేశాల్లో కరోనా వల్ల మృతిచెందిన 80 మందికి ముఖ్యమంత్రి సంతాపం ప్రకటించారు.