నేటి నుండి మద్యం అమ్మకాలు
ఆంధ్రప్రదేశ్‌లో నేటి నుంచి మద్యం అమ్మకాలు ప్రారంభం కానున్నాయి. మూడో దశ లాక్‌డౌన్‌లో భాగంగా కేంద్రం జారీచేసిన మార్గదర్శకాలకు అనుగుణంగా ఉదయం 11 గంటల నుంచి రాత్రి 7 గంటల వరకు మద్యం షాపులకు ఏపీ ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. అదే సమయంలో మద్యం షాపుల వద్ద భౌతిక దూరం తప్పనిసరి చేసింది. ఒకేసారి ఐదుగురికి మాత్రమే మద్యం షాపుల వద్ద అనుమతి ఇవ్వనున్నారు. రద్దీ ఎక్కువగా ఉంటే కాసేపు షాపుల మూసివేయనున్నారు. మరోవైపు ఏపీలో నేటి నుంచి పెంచిన మద్యం ధరలు అమల్లోకి రానున్నాయి. మద్యం అమ్మకాలు తగ్గించేందుకే ధరలు పెంచినట్టు ఎక్సైజ్ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రజత్ భార్గవ తెలిపారు. ప్రజల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మద్యం ధరల పెంపు నిర్ణయం తీసుకున్నారని చెప్పారు.అయితే మాల్స్, బార్లు, క్లబ్‌లు తెరుచుకోవని స్పష్టం చేశారు.