టోలిచౌకి వద్ద వలస కూలీల ఆందోళన
లాక్ డౌన్ నేపథ్యంలో తమకు తినడానికి తిండి కూడా దొరకడం లేదు అని వలస కూలీలు ఆందోళన వక్త్యం చేస్తున్నారు. హైదరాబాద్ లోని టోలీచౌ ఫ్లైఓవర్ వద్ద వివిధ రాష్ట్రాలకు చెందిన కూలీలు తమ సొంత గ్రామాలకు పంపాలని పెద్ద ఎత్తున రహదారి మీదకు చేరుకొని నిరసనకు దిగారు. కేంద్ర ప్రభుత్వం అనుమతి ఇచ్చిన మీరు ఎందుకు పంపడం లేదు అని ప్రశ్నిస్తున్నారు. ఈ విషయం తెలుసుకున్న పోలీసలు అక్కడికి చేరుకొని వారిని కట్టడి చేసే ప్రయత్నం చేస్తున్నారు. కానీ వారు గట్టిగ ఎదురు తిరగడంతో పోలీసులు వారిని వారించే పని ఉన్నారు. రెండు రోజుల పాటు సమయం ఇస్తే భోజన వసతి ఏర్పాటు చేస్తామని చెబుతున్నారు. కేంద్ర సడలింపులో భాగంగా ఇళ్ల నిర్మాణాలు చేసుకునే అవకాశం ఉంది పోలీసులు చెబుతున్నారు.