అక్కడ లాక్ డౌన్ మే 9 వరకు
కరోనా నేపథ్యంలో దాయాది దేశం పాకిస్తాన్ మే 9 వరకు లాక్‌డౌన్‌ను పొడిగిస్తున్నట్టు శుక్రవారం ప్రకటించింది. కోవిడ్ కట్టడికి దేశవ్యాప్తంగా పాక్షిక లాక్‌డౌన్ విధించిన పాకిస్తాన్ కేసులు పెరుగుతుండటంతో ఈ నిర్ణయం తీసుకుంది. గడిచిన 24 గంటల్లో కొత్తగా 642 కేసులు నమోదవడంతో.. దేశవ్యాప్తంగా కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 11,155 కు చేరుకుంది. 237 మంది మరణించగా.. 2,537 మంది కోలుకున్నారు. దేశంలో 79 శాతం కేసులు లోకల్ ట్రాన్స్‌మిషన్ ద్వారా నమోదైనవేనని ఆరోగ్యశాఖ వర్గాలు తెలిపాయి. మే నెలాఖరు లేదా జూన్ ప్రారంభం వరకు కేసుల పెరుగుదల ఉంటుందని ఆరోగ్యశాఖ అంచనావేసింది. ఇక రంజాన్ మొదలు కావడంతో షరతులతో కూడిన ప్రార్థనలకు ప్రభుత్వం అనుమతినిచ్చింది.