ప్రభుత్వ నిబంధనలను పాటించకుంటే కఠిన చర్యలు : సబిత ఇంద్రారెడ్డి

కరోనా వైరస్ వల్ల జనాలు ఇబ్బందులు పడుతున్నందున గతేడాది వసూలు చేసిన ఫీజును తీసుకోవాలి తెలంగాణ విద్యశాఖ మంత్రి సబితఇంద్ర రెడ్డి తెలిపారు. ఇయర్లీ వసూలు చేసే ఫీజును నెలవారీగా ట్యూషన్ ఫీజుగా తీసుకోవాలని సూచించారు. ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని ప్రైవేట్ స్కూల్స్ అమలు చేయాలని కోరారు. ఇప్పటికే ప్రైవేట్ విద్యాసంస్థలపై తిరుపతి రావు కమిషన్ అన్ని వివరాలు సేకరించింది అన్నారు. హైకోర్టులో ప్రైవేట్ విద్యాసంస్థలు వేసిన కేసుపై ప్రభుత్వానికి అనుకూలంగా త్వరలోనే జడ్జిమెంట్ వస్తుందని ఆశిస్తున్నా పేర్కొన్నారు. ట్యూషన్ ఫీజు కాకుండా స్కూల్ యాజమాన్యాలు ఎలాంటి ఇతర ఫీజులు వసూలు చేయడానికి వీలు లేదన్నారు.ప్రభుత్వ నిబంధనలను ప్రైవేట్ స్కూల్ యాజమాన్యాలు విస్మరిస్తే కఠినంగా చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఇందుకోసం ప్రత్యేకంగా టోల్ ఫ్రీ నెంబర్ ను ఏర్పాటు చేయనున్నారని అన్నారు. ఎవరికైనా స్కూల్ యాజమాన్యాలతో ఇబ్బందులు ఉంటే టోల్ ఫ్రీ కి ఫోన్ చేయవచ్చు తెలిపారు.