50శాతం తగ్గిన పెట్రోల్ డిమాండ్!

కరోనాను ఓడించడానికి విధించిన లాక్‌డౌన్ వల్ల దేశంలో పెట్రోల్, డీజిల్ తదితర ఇంధనాల డిమాండ్ 50 శాతం తగ్గింది. ఏప్రిల్ నెల తొలి రెండు వారాల్లో సాధారణం కంటే 50శాతం తక్కువ ఇంధన అమ్మకాలు జరిగినట్లు పెట్రోలు బంకుల రిటెయిలర్స్ చెప్తున్నారు. చాలా రాష్ట్రాల్లో ఇదే పరిస్థితి ఉందని, గాసాయిల్ అమ్మకాలయితే 61శాతం తగ్గిపోయాయని వారు తెలిపారు. గ్యాసోలిన్ 64శాతం, జెట్ ఫ్యూయెల్ 94శాతం తగ్గుదలను చవిచూశాయని తెలుస్తోంది