50 వేల ఉద్యోగాలు: వాల్‌మార్ట్
కరోనా కల్లోలంతో మిలియన్ల మంది అమెరికన్లు తమ ఉద్యోగాలను కోల్పోతున్న సమయంలో రీటైల్ దిగ్గజం వాల్ మార్ట్ శుభవార్త చెప్పింది. రానున్నకాలంలో దాదాపు 50వేల మంది ఉద్యోగులను నియమించుకోవాలని భావిస్తున్నట్టు వెల్లడించింది.కరోనా వైరస్, లాక్ డౌన్ సమయంలో వినియోగదారుల నుండి కిరాణా, గృహ అవసరాలకు డిమాండ్ పెరిగిన నేపథ్యంలో ఈ నియామకాలని వాల్ మార్ట్ ప్రకటించింది. లక్షా 50 వేల మందిని నియమించుకోవాలన్న తమ మునుపటి లక్ష్యాన్ని ఆరువారాలముందే చేరుకున్నామని, సగటున రోజుకు 5,000 మంది చొప్పున తీసుకున్నామని వెల్లడించింది
తాజాగా వాల్‌మార్ట్ దుకాణాలు, క్లబ్బులు, కార్పొరేట్ కార్యాలయాలు, ఇతర పంపిణీ కేంద్రాలలో 50 వేల మంది కార్మికులను నియమించుకో నున్నామని వాల్మార్ట్ యుఎస్ ప్రెసిడెంట్ జాన్ ఫర్నర్ తెలిపారు. తమ ఉద్యోగలు మాస్క్ లు, శానిటైజేషన్ లాంటి నిబంధనలు పాటించాల్సి అవసరం వుందని పేర్కొన్నారు. అలాగే కంపెనీ అత్యవసర సెలవు విధానాన్ని మే చివరి దాకా పొడిగిస్తున్నట్టు వెల్లడించారు.