వాటి వల్ల కరొనను కనుకోవచ్చు

ఆంధ్రప్రదేశ్ లో ప్రతి రోజు కరోనా భాదితుల సంఖ్య పెరుగుతూనే ఉంది. ఇందుకోసం కరోనా పరీక్షల సామర్థ్యం పెంచాలని ప్రభుత్వం ఆలోచన చేసింది. ఇందుకోసం ర్యాపిడ్‌ టెస్టింగ్‌ కిట్ల తీకురావాలని జగన్ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దక్షణ కొరియా నుండి వాటి దిగుమతి చేసుకుంది. వాటి ద్వారా 10 నిమిషాలలో కరోనా లక్షణాలు కనుగొనవచ్చు. దీనిద్వారా పరీక్షల సామర్థ్యం పెరిగిందని.. హాట్‌స్పాట్‌, కంటైన్మెంట్‌ జోన్లలో ర్యాపిడ్‌ టెస్టింగ్‌ నిర్వహిస్తామని సీఎస్‌ నీలంసాహ్ని పేర్కొన్నారు. శుక్రవారం ఆమె మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. అవసరం మేరకు గ్రీన్‌జోన్లలో కూడా ర్యాపిడ్‌ టెస్టింగ్‌లు చేస్తామని చెప్పారు. కంటైన్మెంట్‌ జోన్లలో కఠిన నిబంధనలు అమలు చేస్తున్నామని.. హోం క్వారంటైన్‌ ద్వారా కరోనా కట్టడికి చర్యలు తీసుకుంటున్నామని సీఎస్‌ వివరించారు. కేంద్రం ఇచ్చే సూచనలతో సమన్వయం చేసుకుంటున్నామన్నారు. లాక్‌డౌన్‌కు ప్రజలు సహకరిస్తున్నారని తెలిపారు.