అంధులకు గూగుల్ దృష్టి

అంధులకు ప్రముఖ టెక్నాలజీ సంస్థ గూగుల్‌ గొప్ప కబురు చెప్పింది. దృష్టిలోపం ఉన్నవారు స్మార్ట్‌ఫోన్లలో మెసేజులు, చాటింగ్‌లు చేసుకొనేందుకు వీలుగా టాక్‌బ్యాక్‌ బ్రెయిలీ వర్చువల్‌ కీబోర్డును రూపొందించినట్లు ప్రకటించింది. ఆండ్రాయిడ్‌ ఫోన్‌ యూజర్లకోసం తయారుచేసిన ఈ కీబోర్డు బ్రెయిలీ లిపిలో ఉంటుంది. ఆండ్రాయిడ్‌ 5.0 ఆపై వర్షన్లతో నడిచే ఫోన్లలో ఇది పనిచేస్తుంది.  ఎలాంటి అదనపు హార్డ్‌వేర్‌ అవసరం లేకుండా వేగంగా, సౌకర్యవంతంగా ఫోన్‌లో అక్షరాలు టైప్‌ చేయవచ్చు, వాటిని సోషల్‌మీడియాలో కూడా పోస్ట్‌ చేయవచ్చు, ఈమెయిల్‌ కూడా పంపుకోవచ్చు అని గూగుల్‌ ఓ ప్రకటనలో తెలిపింది.