ప్రభుత్వ నిర్ణయాలకు సహకరించాలి: సాయికిరణ్

ప్రపంచ దేశాలకు పెనుసవాల్ గా మారిన కరోనాను వ్యక్తిగత జాగ్రత్తలతోనే నియంత్రించడం సాధ్యమని సికింద్రాబాద్ పార్లమెంట్ నియోజకవర్గ trs ఇంచార్జి శ్రీ తలసాని సాయి కిరణ్ యాదవ్ వెల్లడించారు. కరోనా నియంత్రణ చర్యల్లో భాగంగా జీహెచ్ ఎంసీ పరిధిలో ని  ఎమ్మెల్యేలు, ప్రజా ప్రతినిధులు క్షేత్ర స్థాయి లో ప్రజలకు సహాయ సహకారాలు అందించాలన్న సీఎం కేసీఆర్ పిలుపు మేరకు  తెరాస యువనేత  తలసాని సాయి కిరణ్ యాదవ్ నగరం లో పలు సేవా కార్యక్రమాలు చేపడుతున్నారు. అందులో భాగంగా ఆదివారం జూబ్లిహిల్స్ mla శ్రీ  మాగంటి గోపినాధ్ తో కలిసి mla క్యాంప్ కార్యాలయంలో ప్రజలకు ఉచితంగా శానిటైజర్లను పంపిణీ చేసి కరోనా నియంత్రణ పై అవగాహన కల్పించారు.  అదేవిధంగా ఖైరతాబాద్ నియోజకవర్గ పరిధిలో mla శ్రీ దానం నాగేందర్ తో కలిసి విధులు నిర్వహిస్తున్న పోలీసులు, పారిశుధ్య సిబ్బంది, ప్రజలకు పంపిణీ చేశారు. సికింద్రాబాద్ పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలోని అన్ని అసెంబ్లీ నియోజకవర్గాలలో mla లు, కార్పొరేటర్లతో కలిసి ఉచితంగా శానిటైజర్లను పంపిణీ చేస్తున్నట్లు వివరించారు. శుక్రవారం నాడు కూడా ముషీరాబాద్ mla ముఠా గోపాల్ తో కలిసి, సనత్ నగర్ నియోజకవర్గ పరిధిలో కార్పొరేటర్లతో కలిసి పంపిణీ చేయడం జరిగిందని ఆయన చెప్పారు. కరోనా మహమ్మారి ని తరిమి కొట్టేందుకు ప్రభుత్వం అన్ని రకాల చర్యలు తీసుకుంటుందని, ప్రజలు ప్రభుత్వ నిర్ణయాలకు సహకరించాలని కోరారు.