కరోన పై జర్నలిస్టులు సైనికులుగా పనిచేస్తున్నారు.

రాష్ట్ర0లోని జర్నలిస్ట్ లు, గ్రామీణ, పట్టణ స్ట్రింగర్లు, ఫోటో, వీడియో జర్నలిస్టులను ఒక కుటుంబ పెద్దగా ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్ రావు ఆదుకోవాలని తెలంగాణ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్ (TUWJ) రాష్ట్ర అధ్యక్షులు అల్లం నారాయణ, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మారుతీ సాగర్ , తెంజు అధ్యక్ష ప్రధాన కార్యదర్శి ఇస్మాయిల్ , రమణ, హైదరాబాద్ అధ్యక్ష కార్యదర్శులు యోగనంద్ , నవీన్ కుమార్ యార, డిప్యూటీ జనరల్ సెక్రటరీ సంపత్ విజ్ఞప్తి చేసారు. పత్రికలకు జర్నలిస్టులు కళ్ళూ చెవుల వంటి వారని, కరోన పై ప్రభుత్వం ప్రకటించిన యుద్ధం లో జర్నలిస్టులు సైనికులుగా పనిచేస్తున్నారన్నారు. అయితే ఈ సంక్షిప్త సమయంలో విధి నిర్వహణలోని జర్నలిస్టుల రక్షణ కోసం వారికి మాస్క్ లు, శానిటేషన్ కిట్లు, నిత్యవసర సరుకులు సమకూర్చాల్సి ఉంది.
కరోనా వైరస్ మహమ్మారి జడలు విప్పిన దశలో న్యూస్ ప్రింట్ సమీకరణ, వాణిజ్య ప్రకటనల సేకరణ రెండూ ఇబ్బందికరమైన దశలో ఈ కళ్ళూ చెవులూ ఇచ్చే వార్తల ప్రచురణ అవుతున్న టాబ్లాయిడ్లు ఇప్పుడు బ్రాడ్ షీట్ లో సంక్షిప్తమయ్యాయి.. దీంతో కీలక విపత్కర సమయంలో వార్తా సేకరణ ఇబ్బందికరమయ్యే స్థితి నెలకొన్నది.. గ్రామీణ ప్రాంతాలు జిల్లాలలో స్ట్రింగర్ ల పేరుతోనో , ఇతర వార్తా సేకరణ యంత్రాంగాల(ఏ జెన్సీ)ల ద్వారా పూర్తికాలం పత్రికారంగం, మీడియానే తమ వృత్తిగా వీళ్లెంచుకున్నారు. రాష్ట్రంలో సుమారు ఇరవై వేల మంది కలం కార్మికులు ఇలా పనిచేస్తున్నారు.. వీళ్లందరికీ యాజమాన్యాలు స్పాట్, స్టోరీ, ప్యాకేజీల కొలమానం ఆధారంగా, లైన్ అకౌంట్ రూపంలో చెల్లిస్తాయి.ఇదే ప్రధాన ఉపాధి వనరు. సన్నబడ్డ పత్రికలో చుక్క తెగుపడ్డట్టు వచ్చే వార్త వాళ్ల కుటుంబపు ఆలనా పాలన కు ఏ మాత్రం ఉపకరించదు. అన్ని సందర్భాల్లోనూ వీళ్ల జీతాలను గురించి ఆదేశించగలిగే యంత్రాంగం కార్మిక శాఖ.. ఇప్పుడు విపత్కర స్థితి. అటు వార్తలు వచ్చే స్థితి లేదు. వార్తలు సేకరించకుండా ఇంటిపట్టున ఉండలేరు. ఇలా ఇరవై వేల మంది వాళ్ల కుటుంబాలు కరోనా లాక్ డౌన్ కొనసాగినంత వరకూ పొట్టచేతబట్టుకోవాల్సిందే. అసంఘటిత కార్మికులని చెప్పలేం గానీ పాత్రికేయుల జీవితాలు అంతకన్న దుర్భరం. ఖర్చులను కష్టాలను అధిగమించడం కోసం యాజమాన్యాలు ప్రచురణ స్థాయి తగ్గించుకోగలవు.. కానీ అదే స్థాయిలో తమ కుటుంబ సభ్యులయిన గ్రామీణ పాత్రికేయులు, మీడియా సభ్యులు, విలేఖరులు, స్ట్రింగర్ల కుటుంబాల బాగోగులను గురించి కూడా వాళ్లు ఆలోచించాలి. ఈ నేపథ్యం లో ముఖ్యమంత్రి కే సీ ఆర్ గారు ఈ విషయాన్ని పరిగణన లోకి తీసుకొని ప్రతీ పాత్రికేయునికి విపత్తు నిధి క్రింద పది వేల రూపాయల చొప్పున యాజమాన్యాలతో ఇప్పించేందుకు కార్మిక శాఖ ద్వారా చొరవ తీసుకోవాలని తెలంగాణ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్స్ (TUWJ-TJF)పక్షాన విజ్ఞప్తి చేస్తున్నట్లు తెలిపారు.