హిమాచల్ ప్రదేశ్ లో భూకంపం

హిమాచల్ ప్రదేశ్ లోని చంబా జిల్లాలో 3 నుంచి 4.3 తీవ్రతతో భూకంపం సంభవించింది. అయితే ఎటువంటి ప్రాణ, ఆస్తి నష్టం జరగలేదు. శుక్రవారం సాయంత్రం 5.11 గంటలకు మొదటి ప్రకంపన నమోదైందని వాతావరణ శాఖ తెలిపింది. సిమ్లా వాతావరణ కేంద్రం డైరెక్టర్ మన్మోహన్ సింగ్ మాట్లాడుతూ శుక్రవారం సాయంత్రం 5.11 నుంచి రాత్రి 8.43 గంటల మధ్య ప్రకంపనలు సంభవించాయి. సాయంత్రం 5.11 గంటలకు భూకంప తీవ్రత 3.6 గా నమోదైందని, తరువాత 5.17 గంటలకు 4.3 తీవ్రతతో, తిరిగి 5.45 గంటలకు 3 తీవ్రతతో, అనంతరం 6.49 గంటలకు 3.8 తీవ్రతతో, రాత్రి 8.43 గంటలకు 3.4 తీవ్రతతో భూకంపం సంభవించిందని ఆయన చెప్పారు. అయితే ప్రాణ, ఆస్తి నష్టం జరగలేదన్నారు.