నీటి సరఫరాలో తగిన జాగ్రత్తలు పాటించాలి
రోజు రోజుకి విస్తరిస్తున్న కరోనా, నీటి సరఫరాలో తగిన జాగ్రత్తలు పాటించాలి , నీటి కొరత రాకుండా నిరంతరం పరిశుభ్రమైన నీటినే అందించాలి.
కరోనా వైరస్ విస్తృతిస్తున్న ఈ తరుణంలో ఎక్కడివాళ్ళు అక్కడనే ప్రతివారు వాళ్ళ ఇంట్లో నే ఉండి తీరాల్సిందే అన్న ప్రభుత్వ నిబంధనలతో దాదాపు యావత్ కుటుంబం సభ్యులు అందరూ ఇంటికే పరిమితి అయ్యారు……కరోనాకి భయపడిన సకుటుంబ సపరివారం ఈ వారాంతం వాళ్ళ వాళ్ల ఇంటిలోనే ఉంటున్నారు…మంచిదే అయితే చేతులు, తరచుగా కడుక్కోవాలని పదే పదే ప్రముఖులు హెచ్చరికాత్మక ప్రచారం చేస్తున్న తరుణంలో నీటి కొరత ఏర్పడుతోంది..ఇంట్లోనే ఉండేవారు బయట తినకుండా ఇంట్లోనే రక రకాల వంటలు చేసుకొని తింటారు ,ఆ గిన్నెలు కడగడం, తరువాత సాధారణంగా ఎక్కువగా బాత్రూముకి వెళ్లడం, చేతులు కాళ్లు కడగడం జరుగుతుంది..ఈ పరిస్థితుల్లో నీళ్లు అధికంగా వినియోగం జరుగుతోంది..అసలే సమ్మరు,ఆ పై ఈ కరోనా…శుభ్రత, పరిశుభ్రత…దీనితో నీటి కొరత.
కావున రాష్ట్రప్రభుత్వం ఈ విషయాన్ని గమనించిన, ప్రాధాన్యత ఇచ్చి జలమండలి ద్వారా జంట నగరాల్లో మరియు నగర శివారు ప్రాంతాల్లో ఎక్కడెక్కడ నీటి సరఫరా చేస్తున్నారో ఆ యా ప్రాంతాలన్నిటిలో నీటి సరఫరా నిరంతరం చేయాలని , ఎలైగైతే కరెంటు నిరంతరాయంగా కొనసాగుతోందో..అలాగే అంతకన్నా అతి ముఖ్యంగా అవసరమైంది మంచి నీరు…ఈ నీటి సరఫరాలో ఏవిధమైన ఆటంకాలు లేకుండా పరిశుభ్రమైన నీటిని అదించాలని, రిజర్ర్వాయర్ ల నుండి, వాటర్ ట్యాంక్ లనుండి, సంపుల నుండి నీటిని విడుదల చేస్తున్నప్పుడు పైప్ లైన్ లీకు కాకుండా చూసుకోవాలి, మురికి నీళ్లు కలవకుండా జలమండలి తదితర లైన్ మెన్స్, తగు జాగ్రత్తలు తీసుకోవాలి, నీటిలో, క్లోరిన్, బ్లీజింగ్ వంటి పౌడర్లు కలపడం, నోటికీ మాస్కులు ,చేతికి గ్లోజస్ ధరించి నీటిని సరఫరా చేయవలెను. శ్రద్ధగా శుభ్రమైన నీటిని సరఫరా చేయకపోతే ఈ వైరస్ విస్తరించే ప్రమాదం ఉంది . కావున ముఖ్యమంత్రి ఈ అంశంపై దృష్టి పెట్టి , జలమండలి వారికి తగిన ఆదేశాలు ఇచ్చినీటి సరఫరాలో అలక్ష్యం చేయకుండా నిరంతరం పరిశుభ్రమైన నీటినే అందించేలా చూడాలి….సురేష్ కశ్యప్