“గిర్నార్ ఎలివేట్ సమ్మిట్ 2024: భారతదేశ వ్యవస్థాపక భవిష్యత్తును

శక్తివంతం చేసిన కార్‌దేఖో సీఈఓ  అమిత్ జైన్”

  • షార్క్ ట్యాంక్ సీజన్ 2, 3లలో ఇన్వెస్ట్ మెంట్ పొందిన 30 కంపెనీలు, ఇతర కంపెనీలు ఈ  సమ్మిట్ లో పాల్గొన్నాయి
  • సదస్సుకు హాజరైనవారు పరిశ్రమ ప్రముఖులతో నేరుగా సంభాషించారు, అమూల్యమైన అభిప్రాయా లను తెలుసుకోగలిగారు,  వారితో నెట్ వర్క్ సంబంధాలను ఏర్పరచుకున్నారు.
  • వ్యక్తిగతీకరించిన మార్గదర్శకత్వం కీలక పాత్ర, సాంకేతికత ప్రాముఖ్యత మరియు వ్యవస్థాపకులు ఎదు ర్కొంటున్న వృద్ధి అడ్డంకుల పరిష్కారానికి సంబంధాల నిర్మాణం  ప్రాముఖ్యతను అమిత్ జైన్ నొక్కి చెప్పారు.

గిర్నార్ ఎలివేట్ సమ్మిట్ 2023 అద్భుతమైన విజయాన్ని అనుసరించి, కార్‌దేఖో గ్రూప్ తన రెండో ఎడిషన్ – గిర్నార్ ఎలివేట్ సమ్మిట్ 2024ను నిర్వహించింది. షార్క్ ట్యాంక్ ఇండియా, అది గాకుం డా కూడా అమిత్ జైన్ పెట్టుబడి పెట్టిన 30 కంపెనీలకు సాధికారత కల్పించడానికి ఈ రెండు రోజుల ఈవెంట్ జూన్ మొదటి వారంలో జైపూర్‌లోని కంపెనీ ప్రధాన కార్యాలయంలో జరిగింది. ఈ సమ్మిట్ లో భాగంగా వివిధ రంగాలలో విభిన్న సెషన్లు జరిగాయి. ఇది భారత్ 2.0ని నిర్మించడానికి వ్యవస్థాపకులతో వ్యక్తిగతంగా కనెక్ట్ అవ్వడానికి, మార్గనిర్దేశం చేయడానికి జైన్ కు గల  ప్రగాఢ నిబద్ధతను ప్రతిబింబిస్తుంది.

వృద్ధి, విజయాన్ని సాధించడానికి కంపెనీలు బ్లూప్రింట్‌ను రూపొందించడంలో సహాయపడటంలో పెట్టుబడి అ నంతర మార్గదర్శకత్వం, మెంటార్ షిప్ ముఖ్యమైన పాత్ర పోషిస్తాయి. గిర్నార్ ఎలివేట్ సమ్మిట్ ఈ కంపెనీల కు అవి వాటి జ్ఞానాన్ని మరింతగా పెంచుకోవడంలో సహకరిస్తుంది. విజయవంతమైన వెంచర్‌లను నిర్మించ డానికి వాటి వ్యూహాలను మెరుగుపరచడంలో సాధికారత కల్పించడానికి ఒక గొప్ప వేదికగా పని చేస్తుంది.

వ్యాపారాలను నిర్మించడం, వృద్ధి చేయడంలో ఉన్న చిక్కులను నేర్చుకోవడంలో వ్యవస్థాపకులకు సహాయప డటానికి ఈవెంట్ మొదటి రోజు వివిధ సెషన్‌లతో ప్రారంభించబడింది. వ్యాపారాల వృద్ధిపై కార్‌దేఖో గ్రూప్ సీఈ ఓ, సహ వ్యవస్థాపకుడు అమిత్ జైన్ ఇన్ సైట్స్ సెషన్‌తో ఈవెంట్ ప్రారంభమైంది. సరైన అవకాశాలను గుర్తించ డం, సమర్థవంతమైన ప్లేబుక్‌ను రూపొందించడం, వ్యాపార వృద్ధికి అధునాతన సాంకేతికతను ఉపయోగించు కోవడం వంటి ప్రాముఖ్యతను జైన్ నొక్కిచెప్పారు. కార్‌దేఖో గ్రూప్ సీఓఓ,  సహ వ్యవస్థాపకుడు అనురాగ్ జైన్ తన వ్యవస్థాపక ప్రయాణాన్ని పంచుకుంటూ బలమైన, భవిష్యత్తుకు సిద్ధంగా ఉన్న సంస్థను నిర్మించడంపై స్ఫూర్తిదాయకమైన సెషన్‌ను నిర్వహించారు.

అవార్డ్ విన్నింగ్ వైరల్ వీడియో మార్కెటర్ ద్వారా “ది ఆర్ట్ ఆఫ్ వైరల్ మార్కెటింగ్”, యాక్సిస్ బ్యాంక్‌  లీడర్‌ల నుండి స్టార్టప్ ఫైనాన్సింగ్ ఇన్ సైట్స్, బ్లూ స్టోన్ జ్యుయలరీ వ్యవస్థాపకుడు, సీఈఓ ద్వారా ఓమ్నిచానెల్ D2C బ్రాండ్‌ను రూపొందించడానికి మార్గదర్శనం, ఇన్‌ఫ్లెక్షన్ పాయింట్ వెంచర్స్  నిర్వాహకులు పంచుకున్న నిధుల సేకరణ వ్యూహాలతో సహా   వివిధ సెషన్‌లతో రోజు మరింత కొనసాగింది.    .

బ్రాండ్‌లకు సాధికారత కల్పించడం, భారతదేశ వ్యవస్థాపక పర్యావరణ వ్యవస్థలో తమదైన ముద్రను వేసే సంస్థ లుగా రూపాంతరం చెందడంలో సహాయపడటాన్ని ఈ కార్యక్రమం తన లక్ష్యంగా పెట్టుకుంది. మొదటి రోజు జరి గిన విజయవంతమైన కార్యక్రమాలతో, ఈ సమ్మిట్ రెండో రోజు పెద్ద ఎత్తున సంస్థను నిర్మించే అంశాలను లో తుగా పరిశోధించింది. చట్టపరమైన అంశాలు, ఫైనాన్స్, నిబంధనల పాటింపు, హెచ్ఆర్ వంటి అంశాలపై సెష న్లను నిర్వహించింది. మేక్‌మైబుక్స్ సీఈఓ నిర్వహించిన పటిష్ఠ ఫైనాన్స్, నిబంధనల పాటింపు సెషన్‌తో పాటు పవర్-ప్యాక్డ్ సెషన్‌లతో ఈ రోజు ప్రారంభమైంది. సినాప్స్ పార్ట్‌నర్స్ వ్యవస్థాపకుడు లీగల్ ఫ్రేమ్‌వర్క్ గురించి వి వరించారు. హెచ్ ఆర్ టీమ్ ను నిర్మించుకోవడంపై రీజెనిసిస్ గ్లోబల్ నెట్‌వర్క్ లీడ్ ఒక సెషన్ నిర్వహించారు. సరైన సహ వ్యవస్థాపకుడిని కనుగొనడంలో తోడ్పడే అంశాల గురించి కాఫీమగ్ సీఈఓ వివరించారు.

మినిమలిస్ట్ వ్యవస్థాపకులు D2C టెక్ స్టాక్‌లో సామర్థ్యాన్ని పెంచడంపై లోతైన  అంశాలతో సెషన్‌తో ఈవెంట్ కొనసాగింది & క్రాక్-ఈడీ సహ వ్యవస్థాపకుడు సరైన ప్రతిభను పొందే చిట్కాలతో ముగించారు.

కార్‌దేఖో గ్రూప్ సీఈఓ, సహ వ్యవస్థాపకులు అమిత్ జైన్ ఈ సందర్భంగా మాట్లాడుతూ, ‘నా దృష్టి డబ్బు పెట్టుబడికి మించి విస్తరించింది. భారతదేశంలో వృద్ధి చెందుతున్న వ్యవస్థాపక ప్రతిభను పెంపొందించడం,  మా ర్గ నిర్దేశం చేయడం, సాంకేతికతతో నయా భారత్ నిర్మాణాన్ని ఉత్ప్రేరకపరచడం వంటి నిబద్ధతతో నేను ముం దుకెళ్తున్నాను. వ్యవస్థాపకులతో వ్యక్తిగత సంబంధాలను ఏర్పరచుకోవడం వారి దృష్టి, సవాళ్లను అర్థం చేసుకోవడానికి సహాయపడుతుందని నేను నమ్ముతున్నాను. గిర్నార్ ఎలివేట్ సమ్మిట్ వంటి కార్యక్రమాలు పారిశ్రామికవేత్తలు ఎదుర్కొనే అడ్డంకులను గుర్తించడానికి, పరిష్కరించేందుకు ఉత్ప్రేరకంగా పనిచేస్తాయి, ఉత్పత్తి-మార్కెట్ ఫిట్, సరైన నిధుల సేకరణ వ్యూహాలు, పోటీని నిర్వీర్యం చేయడం వంటి క్లిష్టమైన అంశాలను మెరుగుపరచడానికి అనుకూలీకరించిన జోక్యాలను సులభతరం చేస్తూ నిపుణులు, సహచరుల నుండి వివిధ అంశాలను నేర్చుకునేందుకు వీలు కల్పిస్తాయి’’ అని అనే వారు.

గిర్నార్ ఎలివేట్ సమ్మిట్ 2024 వర్ధమాన వ్యవస్థాపకులు నేర్చుకునే, నెట్‌వర్క్, ఎదగగలిగే సహకార వాతా వరణాన్ని విజయవంతంగా ప్రోత్సహించింది. కార్‌దేఖో గ్రూప్ ఈ సంప్రదాయాన్ని కొనసాగించడానికి ఎదురు చూస్తోంది. వినూత్నత, సాంకేతికత ద్వారా భారతదేశ ఆర్థిక వృద్ధిని నడిపించే తరువాతి తరం నాయకులకు మద్దతు ఇస్తోంది.