హైదరాబాద్‌లో 3 ఆఫ్‌లైన్ విద్యాపీఠ్ కేంద్రాలను ప్రారంభించిన ఫిజిక్స్ వాలా(PW)
హైదరాబాద్: దేశవ్యాప్తంగా ఎడ్యుకేషనల్ హబ్‌లను ఏర్పాటు చేసి, విద్యార్థులకు విద్యను మరింత అందుబాటులోకి తీసుకురావడానికి ఫిజిక్స్ వాలా (PW)నిబద్ధతను చాటి చెబుతూ, హైదరాబాద్‌లోని మాదాపూర్, హబ్సిగూడ మరియు కూకట్‌పల్లిలో మూడు టెక్-ఎనేబుల్డ్ ఆఫ్‌లైన్ విద్యాపీఠ్ కేంద్రాలను ప్రారంభిస్తున్నట్లు ఫిజిక్స్ వాలా (PW) వ్యవస్థాపకుడు, సీఈఓ అలఖ్ పాండే వెల్లడించారు.
ఫిజిక్స్ వాలా (PW)వ్యవస్థాపకుడు అలఖ్ పాండే తాను నిర్వహిస్తున్న ఆన్-గ్రౌండ్ సంవాద్ సెషన్‌లలో భాగంగా 1,000 మంది విద్యార్థులను భేటీ అయ్యారు. ఈ సెషన్లలో,
విద్యార్ధులు వారి విద్యా ప్రయాణంలో ఎదుర్కొంటున్న సవాళ్లను అర్థం చేసుకునేందుకు వారితో ఆయన ముఖాముఖి మాట్లాడారు. ఆయన ఇప్పటికే వివిధ ఆఫ్‌లైన్ సెంటర్‌లలోని విద్యార్థులను భేటీ కావడంతో పాటు, భారతదేశం వ్యాప్తంగా సంవాద్సెషన్‌లను నిర్వహిస్తూ వస్తున్నారు.
ఫిజిక్స్ వాలా (PW)ప్రస్తుతం భారతదేశంలోని 49 నగరాల్లో 75 విద్యాపీఠ్ కేంద్రాల ద్వారా, 1.5 లక్షల మంది విద్యార్థులకు సేవలు అందిస్తోంది. అలాగే, ఈ కేంద్రాలు 2022 నుంచి ఒక ఏడాదిలోనే ప్రారంభించగా, JEE/NEET కోసం సమగ్ర పాఠ్యాంశాలను ఇక్కడ బోధిస్తున్నారు. దీనితో, ఫిజిక్స్‌వాలా (PW)భారతదేశం వ్యాప్తంగా మూడవ అతిపెద్ద ఆఫ్‌లైన్ నెట్‌వర్క్‌తో వేగంగా అభివృద్ధి చెందుతున్న ఎడ్‌టెక్ కంపెనీగా అవతరించింది.
ఫిజిక్స్ వాలా (PW)వ్యవస్థాపకుడు మరియు సీఈఓ అలఖ్ పాండే మాట్లాడుతూ, “ఈ కేంద్రాలను ఏర్పాటు చేయడం ద్వారా, గతంలో విద్యాభ్యాసం కోసం ఎక్కువ దూరం ప్రయాణిస్తూ వచ్చిన విద్యార్థులకు అందుబాటులో, సరసమైన విద్యను అందించాలని మేము లక్ష్యంగా పెట్టుకున్నాము. దేశవ్యాప్తంగా విద్యార్ధులకు విద్యను చేరువ చేయడం ద్వారా యాక్సెసిబిలిటీని విస్తరింపజేయడమే కాకుండా వారి విద్యాపరమైన సవాళ్లను, ఆకాంక్షలను బాగా అర్థం చేసుకునేందుకు, మరియు పరిష్కరించేందుకు మాకు వెసులుబాటు కల్పిస్తుంది’’ అని వివరించారు.
ఫిజిక్స్ వాలా (PW)ఆఫ్‌లైన్ విద్యాపీఠ్ కేంద్రాలు రికార్డ్ చేసిన లెక్చర్లు, NCERT మెటీరియల్‌లతో సహకారం, ఆఫ్‌లైన్‌లో సందేహ నివృత్తి, వీడియో పరిష్కారాలతో రోజువారీ ప్రాక్టీస్ సమస్యలు (DPPలు), ప్రత్యేక మాడ్యూల్స్, గత ఏడాది ప్రశ్నలు (PYQలు) మరియు PW-AITS (పక్షంవారీ పరీక్షలు) సౌకర్యాలను అందిస్తాయి. ఆఫ్‌లైన్ సెంటర్‌లు స్టూడెంట్ సక్సెస్ టీమ్ (SST) కోసం ప్రత్యేక డెస్క్‌ని కూడా కలిగి ఉన్నాయి. విద్యార్థుల సమస్యలకు త్వరిత, వ్యక్తిగతీకరించిన పరిష్కారాలను అందించడానికి ఫిజిక్స్ వాలా కట్టుబడి ఉంది. పేరెంట్-టీచర్ డాష్‌బోర్డ్ సిస్టమ్ ఉండడంతో, ఇది విద్యార్థుల పురోగతిపై రియల్-టైమ్ అప్‌డేట్లను అందిస్తుంది.